పృథ్వీ షా డోపింగ్ కేసులో బీసీసీఐకి ఊరట !

పృథ్వీ షా డోపింగ్ కేసులో బీసీసీఐకి ఊరట !
WADA Gives Clean Chit To Prithvi Shaw’s Doping Test Process

టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా, మరో ఇద్దరు క్రికెటర్ల డోపింగ్ కేసుల ప్రక్రియకు.. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) క్లీన్ చిట్ ఇచ్చిందని సమాచారం. ఆటగాళ్లపై విధించిన 6 నుంచి 8 నెలల నిషేధ నిర్ణయం సరిగానే ఉందని తెలిపింది. యువ క్రికెటర్ పృథ్వీ షా  డోపింగ్ నిబంధలను ఉల్లంఘించాడని తేలడంతో అతడిపై 8 నెలలపాటు సస్పెన్షన్ వేటు వేసింది. 2019 మార్చి 16 నుంచి 2019 నవంబర్ 15 వరకు ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని […]

Ram Naramaneni

|

Aug 31, 2019 | 10:29 PM

టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా, మరో ఇద్దరు క్రికెటర్ల డోపింగ్ కేసుల ప్రక్రియకు.. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) క్లీన్ చిట్ ఇచ్చిందని సమాచారం. ఆటగాళ్లపై విధించిన 6 నుంచి 8 నెలల నిషేధ నిర్ణయం సరిగానే ఉందని తెలిపింది.

యువ క్రికెటర్ పృథ్వీ షా  డోపింగ్ నిబంధలను ఉల్లంఘించాడని తేలడంతో అతడిపై 8 నెలలపాటు సస్పెన్షన్ వేటు వేసింది. 2019 మార్చి 16 నుంచి 2019 నవంబర్ 15 వరకు ఈ సస్పెన్షన్ వర్తిస్తుందని క్రికెట్ బోర్డు తెలిపింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా యాంటీ డోపింగ్ టెస్ట్‌లో భాగంగా ఈ యంగ్ ప్లేయర్ మూత్ర నమూనాలను అందజేశాడు. అందులో టెర్‌బ్యూటలైన్ ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. దీంతో యాంటీ డోపింగ్ రూల్ ఉల్లంఘన చట్టం ప్రకారం ఆర్టికల్ 2.1 కింద బీసీసీఐ సస్పెన్షన్‌ విధించింది. క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంతో సొంత గడ్డ మీద బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలతో జరిగే సిరీస్‌ల్లో ఆడే అవకాశాన్ని అతడు కోల్పోయాడు.

తనపై నిషేధం వేటు విధించడం పట్ల యువ క్రికెటర్ పృథ్వీ షా గతంలోనే స్పందించాడు. నవంబర్ మధ్య వరకు క్రికెట్ ఆడలేనని నాకు తెలిసిందన్న షా.. ‘‘ఫిబ్రవరిలో బాగా దగ్గు, జలుబు రావడంతో సిరప్ తాగాను. అందులో నిషేధిత ఉత్ప్రేరకం మోతాదులు ఉన్నాయని తేలడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. నాకు దగ్గు టానిక్ తాగేటప్పుడు నేను నిబంధనలను పాటించలేదు. నా తలరాతను అంగీకరిస్తున్నాను. ఇప్పటికీ నేను గాయంతో బాధపడుతున్నాను. సస్పెన్షన్ నిర్ణయం నాకు షాకిచ్చింది. మందులు తీసుకునే సమయంలో క్రీడాకారులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలిసి వచ్చిందంటూ తన బాధను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu