Mohammed Shami: ‘కర్మ’ అంటే ఇదే బ్రో.. అక్తర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ.. పంచ్ మామూలుగా లేదుగా..

|

Nov 14, 2022 | 5:36 AM

ఎట్టకేలకు రెండోసారి టీ20 ప్రపంచకప్‌ని సొంతం చేసుకోవాలనుకున్న పాకిస్థాన్‌ ఆశలపై ఇంగ్లాండ్‌ నీళ్లు చల్లి.. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. టీ20 టైటిల్‌ పోరులో పాకిస్థాన్ ఘోరంగా ఓటమిపాలు కావడంతో..

Mohammed Shami: ‘కర్మ’ అంటే ఇదే బ్రో.. అక్తర్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మహ్మద్ షమీ.. పంచ్ మామూలుగా లేదుగా..
Shami Shoaib Akhtar
Follow us on

టీ-20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ చరిత్ర సృష్టించింది. టీ20 ఫైనల్లో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. ప్రపంచకప్‌ ఫైనల్స్‌లో ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టి జగజ్జేతగా నిలిచింది. ఎట్టకేలకు రెండోసారి టీ20 ప్రపంచకప్‌ని సొంతం చేసుకోవాలనుకున్న పాకిస్థాన్‌ ఆశలపై ఇంగ్లాండ్‌ నీళ్లు చల్లి.. 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే.. టీ20 టైటిల్‌ పోరులో పాకిస్థాన్ ఘోరంగా ఓటమిపాలు కావడంతో ఆ దేశ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఓ బాధాకరమైన ట్వీట్‌ చేశాడు. బ్రొకెన్ హార్ట్ ఎమోజీని ట్వీట్ చేస్తూ.. పాక్ ఓటమితో గుండె బద్దలైపోయింది అన్నట్లుగా తన బాధను వ్యక్తం చేశాడు. అయితే, ఈ ట్వీట్‌కు భారత సీనియర్‌ పేసర్‌.. మహ్మద్‌ షమీ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.

అక్తర్‌ చేసిన ట్వీట్‌కు షమీ రిట్వీట్ చేస్తూ.. ‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ అని ఆసక్తికర రీప్లే ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే, షమీ ఇలా స్పందించడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. సెమీ ఫైనల్-2‭లో ఇంగ్లాండ్ చేతిలో భారత్‌ ఓడిపోయిన అనంతరం టీమ్‌ఇండియా ఆటతీరును పాక్ ఆటగాళ్లు హేళన చేస్తూ.. ట్విట్లు చేశారు. ఫైనల్‌లో భారత్‌తో తలపడాలని పాక్‌ ఎదురుచూసిందని.. ఇకపై అది సాధ్యం కాదంటూ అక్తర్‌ ఎద్దేవా చేశాడు. ఇది ‘భారత్‌కు అత్యంత దారుణమైన ఓటమి. ఈ ఓటమికి వారు అర్హులే. ఫైనల్‌కు చేరే అర్హత వారికి లేదు’ అంటూ టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు.

ఇవి కూడా చదవండి

అంతటితో ఆగకుండా సెమీస్‌తో పోల్చితే ఇంగ్లాండ్‌ మంచి పరిస్థితిలో ఉందని.. అయితే, పాక్‌ బౌలర్లు టీమ్ఇండియా బౌలర్ల మాదిరి కాదంటూ వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్‌పై ఇంగ్లాండ్ విజయం సాధించడం అంత సులభం కాదు.. వారు ఎంతో కష్టపడాల్సి ఉంటుందంటూ అక్తర్‌ మరోసారి వ్యాఖ్యానించాడు. ఈ రెండు సందర్భాల్లో షోయబ్‌ అక్తర్.. టీమ్‌ఇండియాపై విమర్శలు గుప్పించడంతో చాలామంది అతని తీరుపై దుమ్మెత్తిపోశారు.

తాజాగా.. ఫైనల్స్‌లో పాకిస్థాన్ ఘోరంగా ఓడిపోవడంతో తనబాధను వెళ్లబోసుకోగా.. అంతకుముందు అక్తర్ టీమిండియాపై చేసిన వ్యాఖ్యలన్నింటిని తిప్పికొడుతూ బౌలర్ షమి దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చాడు. ఇంకేముంది.. షమి ట్విట్ నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. పాకిస్థాన్ అత్సుత్సాహమే కొంపముంచింది.. షమి చెప్పింది కరెక్టే అంటూ నెటిజన్లు రిప్లే ఇస్తున్నారు.

షమీ ట్విట్‌కు మళ్లీ అక్తర్ రిట్వీట్ చేశారు. హర్షా భోగ్లే చేసిన ట్విట్‌ను యాడ్ చేస్తూ దీనిని సెన్సిబుల్ ట్వీట్ అంటారంటూ వ్యాఖ్యానించాడు. ఏదిఏమైనప్పటికీ.. పాకిస్తాన్ ఓటమిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఫన్నీ మీమ్స్ తో పాక్‌కు కౌంటర్ ఇస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం..