అమ్మగా మారాక అరుదైన విజయాలు..”సరిలేరు మీకెవ్వరూ”

|

Jan 20, 2020 | 3:11 PM

ఒకవైపు మాతృమూర్తిగా బిడ్డ సంరక్షణను చూసుకోవడం, మరోవైపు క్రీడారంగంలో రాణిస్తూ..దేశ జెండాను రెపరెపలాడించడం. ఏకకాలంలో రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ..”సరిలేరు మీకెవ్వరు” అనిపించుకుంటున్నారు భారత విమెన్ ప్లేయర్లు. దాదాపు రెండేళ్లకు పైగా ఆటకు దూరమై, తిరిగి మెగాటోర్నీలో పున:ప్రవేశం చేసి విన్నర్‌గా సత్తా చాటింది భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అమ్మ అయిన తర్వాత ఆమె ఆడిన తొలి టోర్నీ ‘హోబర్ట్ ఇంటర్నేషనల్’లో మిక్డ్స్‌ డబుల్స్ కేటగిరీలో టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఈ నెల 18న ఆస్ట్రేలియాలోని […]

అమ్మగా మారాక అరుదైన విజయాలు..సరిలేరు మీకెవ్వరూ
Follow us on

ఒకవైపు మాతృమూర్తిగా బిడ్డ సంరక్షణను చూసుకోవడం, మరోవైపు క్రీడారంగంలో రాణిస్తూ..దేశ జెండాను రెపరెపలాడించడం. ఏకకాలంలో రెండు బాధ్యతలు నిర్వర్తిస్తూ..”సరిలేరు మీకెవ్వరు” అనిపించుకుంటున్నారు భారత విమెన్ ప్లేయర్లు. దాదాపు రెండేళ్లకు పైగా ఆటకు దూరమై, తిరిగి మెగాటోర్నీలో పున:ప్రవేశం చేసి విన్నర్‌గా సత్తా చాటింది భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. అమ్మ అయిన తర్వాత ఆమె ఆడిన తొలి టోర్నీ ‘హోబర్ట్ ఇంటర్నేషనల్’లో మిక్డ్స్‌ డబుల్స్ కేటగిరీలో టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఈ నెల 18న ఆస్ట్రేలియాలోని హోబర్ట్‌లో జరిగిన ఫైనల్‌లో 6-4, 6-4తో విన్నర్‌గా నిలిచింది సానియా-నదియా జోడి. తదనంతరం గ్రౌండ్‌లో తన బిడ్డతో ఫోటో దిగి “జీవితంలో ఇది అత్యంత ఆనందకరమైన రోజు” అని  ఫోటో పోస్ట్ చేసింది సానియా. నిజంగా ఇది మాములు విషయం కాదు. ఆమెకు ఇప్పుడు రకరకాల సవాళ్లు ఉంటాయి. బిడ్డ పుట్టిన తర్వాత మానసికంగా, శారీరకంగా కొన్ని మార్పులు సంభవిస్తాయి. వాటిన్నింటికి ఎదురొడ్డి నిలవాలి. జిమ్‌లో ఎక్కువసేపు శ్రమించాలి. మానసికంగా కూడా ఎంతో సంసిద్దత సాధించాలి. వీటన్నింటి దాటి వచ్చి ఆమె ప్రదర్శించిన ఆటతీరు నిజంగా అమోఘం.

మేరీ కోమ్ ఎందరికో ఆదర్శం:

అమ్మ అయినా ఆటలో చిరస్మరనీయ విజయాలు సాధించొచ్చు అని చెప్పడానికి మేరీ కోమ్ ఎందరికో ఆదర్శం. ఆమె తల్లిగా, బాక్సర్‌గా రెండు పాత్రలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నారు. అనేక ప్రపంచ చాంపియన్‌షిప్‌లు గెలిచి దేశానికి కలికితురాయిగా మారారు. పరుగుల రాణి పీటీ ఉష సైతం నైన్టీస్‌లో ఇటువంటి చారిత్రక విజయాలే సాధించారు. ఒక వైపు ప్రాణం పోయడం, మరోవైపు కోట్ల ప్రాణాలను విజయాలతో ఉప్పొంగేలా చెయ్యడం..భారత క్రీడా చరిత్రలో మహిళామణులు మీ పాత్ర మరిచిపోలేనిది. మీ అవిరళ కృషికి, మొక్కవోని దీక్షకు టీవీ9 సెల్యూట్ చేస్తోంది.