Cricket: టీ20 ప్రపంచకప్ లో ఆడకపోవడంపై స్పందించిన ‘బుమ్రా’.. ట్వీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు..

|

Oct 04, 2022 | 5:30 PM

గాయం కారణంగా భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచ కప్ కు దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధికారికంగా వెల్లడించిన ఒకరోజు తర్వాత.. తాను టీ20 ప్రపంచకప్ కు దూరం కావడంపై..

Cricket: టీ20 ప్రపంచకప్ లో ఆడకపోవడంపై స్పందించిన బుమ్రా.. ట్వీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు..
Jasprit Bumrah
Follow us on

గాయం కారణంగా భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా టీ20 ప్రపంచ కప్ కు దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) అధికారికంగా వెల్లడించిన ఒకరోజు తర్వాత.. తాను టీ20 ప్రపంచకప్ కు దూరం కావడంపై స్వయంగా బూమ్రా స్పందించాడు. ఎంతో ముఖ్యమైన టీ20 ప్రపంచకప్ కు దూరమైనప్పటికి తాను ఎంతో ధైర్యాన్ని కోల్పోనని, గాయం నుంచి కోలకున్న తర్వాత ఆస్ట్రేలియాలో మ్యాచ్ లు ఆడనున్న భారత జట్టును ఉత్సహపరుస్తానని ట్వీట్ చేశారు. ఈ సారి టీ20 ప్రపంచ కప్ లో భాగస్వామిగా లేకపోవడంపై తాను ధైర్యం గానే ఉన్నానని, అయితే తాను గాయం నుంచి త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన వారందరికి ధన్యవాదాలంటూ ట్విట్టర్ లో పేర్కొన్నాడు బూమ్రా. తాను గాయం నుంచి కోలకున్న తర్వాత టీమ్ ను ఉత్సాహపరిచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పాడు. వాస్తవానికి దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ తో పాటు టీ20 ప్రపంచకప్ కు తొలుత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. అయితే గాయం కారణంగా దక్షిణాఫ్రికా తో టీ20 సిరీస్ నుంచి తప్పుకోవల్సి వచ్చింది. అతడి స్థానంలో హైదరబాద్ కు చెందిన మహ్మద్ సిరాజ్ ను జట్టుకలోకి ఎంపిక చేశారు. కానీ రెండో టీ20లో సిరాజ్ కు ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కలేదు. మూడో టీ20 మ్యాచ్ లో సిరాజ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

దక్షిణాఫ్రికాతో సిరీస్ కు దూరమైనప్పటికి, టీ20 ప్రపంచ కప్ నాటికి జస్ప్రీత్ బూమ్రా జట్టులోకి వస్తారని తొలుత అంతా ఆశించారు. అయితే బూమ్రా ఆరోగ్య పరిస్థితిపై వైద్య, ఆరోగ్య నిపుణులతో సంప్రదించిన తర్వాత బీసీసీఐ వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం టీ20 ప్రపంచ కప్ నుంచి బూమ్రా దూరం అయినట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అయితే అతడి స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. టీ20 ప్రపంచ కప్ లో బూమ్రా స్థానంలో ఎవరూ ఆడతారనేది త్వరలోనే బీసీసీఐ ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు టీ20 ప్రపంచ కప్ కు ఎంపిక చేసిన భారతజట్టులో స్టాండ్ బై ఆటగాళ్ల జాబితాలో ఉన్న మహ్మద్ షమీ, దీపక్ చాహర్ లలో ఒక్కరికి బూమ్రా స్థానంలో చోటు దక్కవచ్చనే చర్చ సాగుతోంది. అయితే బుమ్రా స్థానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో స్థానం సంపాదించిన మహ్మద్ సిరాజ్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయితే బీసీసీఐ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది తెలియాల్సి ఉంది. మరోవైపు భారత్ అన్ని మ్యాచుల్లో ఇటీవల వరుసగా గెలుస్తూ వస్తున్నప్పటికి.. జట్టుకు డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్య వేధిస్తోంది. చివరి ఓవర్లలో బౌలింగ్ చేస్తున్న వారంతా అధిక పరుగులు సమర్పిస్తూ వస్తున్నారు. బూమ్రా జట్టులో ఉన్నట్లయితే డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్యకు పరిష్కారం దొరికే ఛాన్స్ ఉండేది. అయితే గాయం కారణంగా బూమ్రా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు. ఎంపికైన ఆటగాడు డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్యను తీరుస్తాడా అనేది క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతున్న అతి పెద్ద ప్రశ్న.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..