చెలరేగిన హెట్‌మైర్, హోప్.. విండీస్ ఘనవిజయం

చెన్నై వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డేలో విండీస్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. 288 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. ప్రారంభంలోనే ఓపెనర్ అంబ్రిస్.. తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హెట్‌మైర్ చెలరేగిపోయాడు. కేవలం106 బంతుల్లో […]

చెలరేగిన హెట్‌మైర్, హోప్.. విండీస్ ఘనవిజయం
Follow us

| Edited By:

Updated on: Dec 15, 2019 | 11:26 PM

చెన్నై వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తొలి వన్డేలో విండీస్ ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని మరో 13 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. 288 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన విండీస్.. ప్రారంభంలోనే ఓపెనర్ అంబ్రిస్.. తొమ్మిది పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హెట్‌మైర్ చెలరేగిపోయాడు. కేవలం106 బంతుల్లో 11ఫోర్లు, 7 సిక్సులతో 139 పరుగులు చేసి విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మరో ఓపెనర్‌గా వచ్చిన హోప్ కూడా సెంచరీతో కదంతొక్కాడు. 151 బంతుల్లో 7ఫోర్లు, ఓ సిక్స్‌తో 102 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు.హెట్‌మైర్‌ వెనుదిరిగిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నికోలస్ పూరన్ 23 బంతుల్లో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఇక టీమిండియా బ్యాట్స్‌మెన్స్‌ ఆరంభంలోనే తడబడ్డారు. రోహిత్ శర్మ 36 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ 6 పరుగులకే ఓటయ్యాడు. కెప్టెన్ కోహ్లీ 4 పరుగులకే వెనుదిరిగాడు. అయితే అనంతరం వికెట్ పడకుండా.. శ్రేయాస్ అయ్యర్, పంత్‌లు స్కోర్ బోర్డును ముందుకు పరుగెత్తించారు. శ్రేయస్‌ అయ్యర్‌ 88 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 70 పరుగులు చేయగా.. పంత్ 69 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 71పరుగులు చేశాడు.

అయితే కీలక సమయంలో వీరిద్దరు ఔటయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్‌ జాదవ్‌ 35 బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్‌తో 40 పరుగులు చేయగా.. జడేజా 21 పరుగులు చేశారు. అయితే చివర్లో జాదవ్‌, జడేజా, శివమ్‌దూబె వరుసగా విఫలమయ్యారు. దీంతో టీమిండియా 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. విండీస్‌ బౌలర్లలో కాట్రెల్‌, కీమో పాల్‌, ఆల్జరీ జోసెఫ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..