WTC Final Match: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై క్లారిటీ ఇచ్చిన గుంగూలీ.. అక్కడే ఎందుకంటే.. !

|

Mar 09, 2021 | 6:16 PM

India vs New Zealand Final Match: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ వేదిక మారింది. లార్డ్స్‌లో జరగాల్సిన ఫైనల్స్‌ను

WTC Final Match: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై క్లారిటీ ఇచ్చిన గుంగూలీ.. అక్కడే ఎందుకంటే.. !
Follow us on

India vs New Zealand Final Match: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్ వేదిక మారింది. లార్డ్స్‌లో జరగాల్సిన ఫైనల్స్‌ను సౌతాంప్టన్‌కు మర్చారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇటీవల భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్ సిరీస్‌లో టీమిండియా 3-1 తేడాలో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో టీమిండియా ఫైనల్స్‌కు చేరింది. ఇక జూన్ 18 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ పోరులో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అయితే, ఈ ఫైనల్ మ్యాచ్ ముందుగా లార్డ్స్ స్టేడియంలో జరుగుతుందని ప్రకటించారు. తాజాగా లార్డ్స్ కాదు, సౌతాంప్టన్‌లో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే స్పందించిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలి.. ‘టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరిగే వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. లార్డ్స్ స్టేడియంలో కాకుండా సౌతాంప్టన్‌లో మ్యాచ్‌ జరగబోతోంది. ఇక్కడి స్టేడియంలోనే అనేక సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా స్టేడియంలోనే హోటల్ కూడా‌ ఉండడంతో బయోబబుల్‌ ఏర్పాటు చేసేందుకు ఇరు జట్లకు అనువుగా ఉంటుంది. కరోనా తర్వాత ఇంగ్లండ్‌ ఎక్కువ మ్యాచ్‌లను సౌతాంప్టన్‌లో ఆడడానికి కారణం ఇదే’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ వేదిక మార్పుపై ఐసీసీ ఇంత వరకూ స్పందించకపోవడం విశేషం.

Also read:

Drugs Ediction: ముంబైని దాటేసిన ఢిల్లీ.. డ్రగ్స్ వినియోగంలో దేశరాజధాని ప్రపంచంలోనే మూడో పెద్ద సిటీ.. న్యూయార్క్ టాప్

Fiver Rupees Coins: 5, 10 రూపాయల కాయిన్స్ ఇవ్వండి.. లక్షలు తీసుకెళ్లండి.. హైదరాబాద్‌లో ఏం జరిగిందంటే..!

India-China: భారత్‌- చైనా దేశాల మధ్య శాంతిపర్వం నెలకొంటుందా..? ఇరు దేశాల మధ్య చర్చలకు ఎప్పుడు పుల్‌స్టాప్‌ పడుతుంది..?