Breaking: ఇండియా వెర్సస్ ఇంగ్లాండ్.. రద్దైన ఐదో టెస్ట్‌పై క్లారిటీ.. మ్యాచ్ ఎప్పుడంటే.!
కరోనా కారణంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రద్దయిన ఐదో టెస్టుపై క్లారిటీ వచ్చేసింది. ఈ టెస్టును జూలై 2022లో నిర్వహించనున్నారు.
కరోనా కారణంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య రద్దయిన ఐదో టెస్టుపై క్లారిటీ వచ్చేసింది. ఈ టెస్టును జూలై 1, 2022లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇరు బోర్డులు ఏకాభిప్రాయానికి వచ్చాయి. కాగా, ఇటీవల భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో టెస్టు కరోనా కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. టీమిండియా శిబిరంలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో ఇరు బోర్డులు ఏకాభిప్రాయానికి వచ్చి ఐదో టెస్టును తాత్కాలికంగా రద్దు చేశాయి. అనంతరం ఈ మ్యాచ్ అంశంపై బీసీసీఐ, ఈసీబీ విస్తృతంగా చర్చలు నిర్వహించి.. సిరీస్‌లో విజేతలను తేల్చేందుకు ఐదో టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఇక వచ్చే ఏడాది భారత్, ఇంగ్లాండ్ మధ్య టీ20, వన్డే సిరీస్ జరగనున్నాయి. ఆ సమయంలోనే ఈ టెస్టు కూడా జరగనుంది.