
హైదరాబాద్: ఐసీసీ వన్డే క్రికెట్ ప్రపంచకప్ గెలిచే సత్తా కోహ్లీ సేనకు ఉందని టీమిండియా మాజీ సారథి అజహరుద్దీన్ ధీమా వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్‌లో అద్భుతంగా బంతులు వేయగల బౌలర్లు మనకు ఉన్నారని వెల్లడించాడు. ప్రపంచకప్ ఫేవరెట్ భారత్ అని పేర్కొన్నాడు.
‘ప్రపంచకప్‌లో టీమిండియా ఫేవరెటే. తొలి ప్రాధాన్యం భారత్‌కే ఇస్తాను. రెండు, మూడు స్థానాలను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు ఇస్తా. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. గ్రౌండ్‌లో ఏ జట్టు బాగా ఆడుతుందో అదే గెలుస్తుంది. కొన్ని ఓటములూ ఎదురవుతాయి. అయితే మన జట్టుకు అలాంటివి జరగకూడదని కోరుకుంటున్నా’ అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు.