Hockey World Cup: హాకీ వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ చేతిలో భారత్‌కు 3-1 ఓటమి

Hockey World Cup: జరగబోయే మ్యాచ్‌లో భారత్, అర్జెంటీనాపై కనీసం 6 కంటే ఎక్కువ గోల్స్ తేడాతో భారీ విజయం సాధించాలి. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు తన తర్వాతి రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవాల్సి ఉంటుంది. తొలి అర్ధభాగంలో నెదర్లాండ్స్ పెనాల్టీ కార్నర్‌లను సంపాదించగా..

Hockey World Cup: హాకీ వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్ చేతిలో భారత్‌కు 3-1 ఓటమి
Hockey World Cup

Updated on: Aug 22, 2026 | 10:09 PM

Hockey World Cup: యామ్‌స్టెల్‌వీన్‌లోని వాగ్నర్ హాకీ స్టేడియంలో జరిగిన పురుషుల హాకీ ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత హాకీ జట్టు 1-3 తేడాతో వరల్డ్ నంబర్-1 నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ విజయం ద్వారా నెదర్లాండ్స్ సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, భారత జట్టు సెమీఫైనల్ రేసు క్లిష్టంగా మారింది.

ఇప్పుడు, భారత్ ఆగస్టు 24న అర్జెంటీనాతో జరిగే మ్యాచ్‌లో ఆరు గోల్స్‌కు పైగా తేడాతో గెలవాలి. 53వ నిమిషంలో వాన్ డామ్ స్కోరును 3-1కి పెంచాడు. 51వ నిమిషంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మార్చాడు. 41వ నిమిషంలో డూకో టెల్జెన్‌క్యాంప్ మొదటి గోల్ చేసిన తర్వాత, 49వ నిమిషంలో హెడెమేకర్స్ ఫీల్డ్ గోల్‌తో ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.

భారత్ సెమీఫైనల్ చేరాలంటే:

ఆగస్టు 24న జరగబోయే మ్యాచ్‌లో భారత్, అర్జెంటీనాపై కనీసం 6 కంటే ఎక్కువ గోల్స్ తేడాతో భారీ విజయం సాధించాలి. అదే సమయంలో ఇంగ్లాండ్ జట్టు తన తర్వాతి రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోవాల్సి ఉంటుంది. తొలి అర్ధభాగంలో నెదర్లాండ్స్ పెనాల్టీ కార్నర్‌లను సంపాదించగా, భారత జట్టు ఫీల్డ్ గోల్ అవకాశాలను సృష్టించుకుంది. అయితే, ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. క్రికెట్ దిగ్గజాలైన స్టీవ్ వా, రాహుల్ ద్రావిడ్, హాకీ దిగ్గజాలైన జేమీ డ్వైర్, ట్యూన్ డి నూయెర్ మ్యాచ్ వీక్షించడానికి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని స్పోర్ట్స్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us