AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC Test rankings : టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండో స్థానం దక్కించుకున్న టీమిండియా ఆల్ రౌండర్

ఐసీసీ మంగళవారం టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో టీమిండియా అల్ రౌండర్ రవీంద్ర జడేజా 428 పాయింట్లతో  రెండో స్థానంలో నిలిచాడు...

ICC Test rankings : టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండో స్థానం దక్కించుకున్న టీమిండియా ఆల్ రౌండర్
Rajeev Rayala
|

Updated on: Jan 12, 2021 | 5:51 PM

Share

ఐసీసీ మంగళవారం టెస్ట్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఈ ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 428 పాయింట్లతో  రెండో స్థానంలో నిలిచాడు. 446 పాయింట్లతో బెన్‌ స్టోక్స్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ కైల్‌ జేమిస్‌ టాప్‌ 5లో చోటు సంపాదించాడు. ఇక బ్యాటింగ్‌ విభాగంలో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ 919 పాయింట్లతో మొదటిస్థానంలో కొనసాగుతున్నాడు. స్మిత్‌ 900 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 870 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కాగా  చతేశ్వర్‌ పుజారా  8వ స్థానంలో నిలవగా.. అజింక్యా రహానే  7వ స్థానంలో నిలిచాడు. అలాగే బౌలింగ్‌ విభాగంలో ఆసీస్‌ పేసర్‌ పాట్‌ కమిన్స్‌ 908 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా.. టీమిండియా బౌలర్లు అశ్విన్ 9వ స్థానం‌, బుమ్రా 10వ స్థానంల్లో ఉన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి: 

Thailand Open Updates: థాయిలాండ్ ఓపెన్ మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు

”స్టీవ్ స్మిత్.. ఏ తప్పూ చేయలేదు.. అలా చేయడం అతని అలవాటు మాత్రమే”.. వివాదంపై క్లారిటీ.!