India Vs Australia 2020 : జడేజా ప్లేస్ ను రీప్లేస్ చేయనున్న వాషింగ్టన్‌ సుందర్..వృద్ధిమాన్‌ సాహా మళ్లీ బెంచ్‌కేనా..?

ఆస్ట్రేలియా టూర్ మొదలైన నాటి నుంచి ఏదో రకంగా భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొదట్లో గాయం కారణంగా వన్డేలు, టీ20లు...

  • Rajeev Rayala
  • Publish Date - 9:08 pm, Tue, 12 January 21
India Vs Australia 2020 :  జడేజా ప్లేస్ ను రీప్లేస్ చేయనున్న వాషింగ్టన్‌ సుందర్..వృద్ధిమాన్‌ సాహా మళ్లీ బెంచ్‌కేనా..?

India Vs Australia 2020 : ఆస్ట్రేలియా టూర్ మొదలైన నాటి నుంచి ఏదో రకంగా భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మొదట్లో గాయం కారణంగా వన్డేలు, టీ20లు, తొలి రెండు టెస్టులకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ దూరం కాగా.. పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ మొత్తం సిరీస్‌కే దూరమయ్యాడు. అటు మరో బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ ఫిట్‌గా లేకపోవడంతో సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. ఇక సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఫామ్‌లో ఉన్న ఆల్‌రౌండర్‌ జడేజా, పేసర్‌ బుమ్రా, హనుమ విహారీ గాయాల కారణంగా  నాలుగో టెస్టుకు దూరమయ్యారు. దాంతో వాషింగ్టన్‌ సుందర్‌ ఎంట్రీ ఇచ్చారు. జడేజా స్థానాన్ని సుందర్‌తో భర్తీ చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం.సుందర్‌ను ఎంపిక చేస్తే రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా మళ్లీ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి:

ICC Test rankings : టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండో స్థానం దక్కించుకున్న టీమిండియా ఆల్ రౌండర్