”స్టీవ్ స్మిత్.. ఏ తప్పూ చేయలేదు.. అలా చేయడం అతని అలవాటు మాత్రమే”.. వివాదంపై క్లారిటీ.!

Steve Smith News: సిడ్నీ టెస్టు ఐదో రోజు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ చెరిపేస్తున్న...

''స్టీవ్ స్మిత్.. ఏ తప్పూ చేయలేదు.. అలా చేయడం అతని అలవాటు మాత్రమే''.. వివాదంపై క్లారిటీ.!
Follow us

|

Updated on: Jan 12, 2021 | 4:01 PM

Steve Smith News: సిడ్నీ టెస్టు ఐదో రోజు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గార్డ్ మార్క్‌ను ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ చెరిపేస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో స్మిత్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. ‘స్మిత్ చీటర్’, ‘నువ్వు మారావా’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే అసలు ఆ సమయంలో ఏం జరిగిందన్న విషయాన్ని ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ‌లో వివరించాడు. పంత్ గార్డును స్మిత్ చెరిపేయలేదని చెప్పుకొచ్చాడు.

”ఈ అంశంపై నేను స్మిత్‌తో మాట్లాడాను. అది సామాజిక మాధ్యమాల్లో కనిపించిన విధానంపై అతను నిరాశ చెందాడు. మీరు స్టీవ్ స్మిత్‌ను టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు చూస్తే.. ఇలా క్రీజు వద్దకు వెళ్లి తాను బ్యాటింగ్ చేస్తున్నట్లు రోజుకు ఐదు లేదా ఆరుసార్లు ఊహించుకుంటాడు. గార్డును తనకు అనుకూలంగా మార్చుకుంటాడు” అని పైన్ వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్‌లో వెల్లడించాడు.

డొమెస్టిక్, ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్‌ల్లో స్టీవ్ స్మిత్ ఇలా చేయడం చాలాసార్లు తాను కూడా చూశానని పైన్ అన్నాడు. ఒకవేళ నిజంగానే స్మిత్ కావాలని పంత్ గార్డును చెరిపేస్తే.. భారత ఆటగాళ్లు అప్పుడే ఫిర్యాదు చేసేవారు కదా అని చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా స్మిత్ చేసిన ఈ పొరపాటు.. అతడిని మరోసారి బ్యాడ్ వ్యక్తిగా చిత్రీకరించిందని చెప్పాలి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..