వరల్డ్‌కప్‌కి కామెంటేటర్లు ఎవరో తెలుసా.!

|

May 17, 2019 | 3:52 PM

ఐసీసీ 2019 వన్డే వరల్డ్‌కప్ ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించే 24 మంది సభ్యులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. అందులో భారత్ నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. హర్ష భోగ్లే, సంజయ్ మంజ్రేకర్‌తో పాటు సౌరవ్ గంగూలీ గొంతు కలపనున్నారు. కాగా శ్రీలంక నుంచి కుమార్ సంగక్కర, పాకిస్థాన్ నుంచి వసీం అక్రమ్, రమీజ్ రాజా, ఆస్ట్రేలియా నుంచి మైకేల్ క్లార్క్ ఈ ప్యానల్‌లో […]

వరల్డ్‌కప్‌కి కామెంటేటర్లు ఎవరో తెలుసా.!
Follow us on

ఐసీసీ 2019 వన్డే వరల్డ్‌కప్ ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించే 24 మంది సభ్యులను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. అందులో భారత్ నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. హర్ష భోగ్లే, సంజయ్ మంజ్రేకర్‌తో పాటు సౌరవ్ గంగూలీ గొంతు కలపనున్నారు. కాగా శ్రీలంక నుంచి కుమార్ సంగక్కర, పాకిస్థాన్ నుంచి వసీం అక్రమ్, రమీజ్ రాజా, ఆస్ట్రేలియా నుంచి మైకేల్ క్లార్క్ ఈ ప్యానల్‌లో చోటు సంపాదించుకున్నారు.

ఐసీసీ ఈసారి మహిళలకు కూడా అవకాశం కల్పించింది. ఇషా గుహ, మెలనీ జోన్స్‌, అలిసన్‌ మిచెల్‌ కూడా ఈ టోర్నీలో వ్యాఖ్యానించనున్నారు.