Dronavalli Harika : సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలు ఎంతో సున్నితంగా ఉంటారు. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా ఇబ్బందిపడుతుంటారు. ఈ సమయంలో ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. మరీ అవసరమైతే తప్ప కాలు బయటపెట్టరు. అలాంటిది 9 నెలల గర్భంతో చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంది తెలుగు తేజం ద్రోణవల్లి హారిక (Dronavalli Harika). అంతేకాదు తమిళనాడు వేదికగా జరిగిన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో కాంస్య పతకం గెల్చుకుంది. కాగా హారిక అంకిత భావం, నిబద్ధతను చూసి క్రీడాలోకం హర్షిస్తోంది. సోషల్ మీడియాలో మన గ్రాండ్‌మాస్టర్‌పై ప్రశంసలు, అభినందనల వర్షం కురుస్తోంది.
డాక్టర్ల సలహాలు, సూచనలతో..
చెస్ ఒలింపియాడ్‌లో కాంస్యం గెలిచిన భారత మహిళల ‘ఎ’ జట్టులో హారిక కూడా సభ్యురాలు. ప్రస్తుతం 9 నెలల గర్భిణీ అయిన హారిక.. ఒక దశలో టోర్నీలో పాల్గొనడం సందేహంగా మారింది. అయితే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంది. దీనికి తోడు చెస్ ఒలింపియాడ్ చెన్నైలో జరగడం ఈ స్టార్ చెస్ ప్లేయర్‌కు బాగా కలిసొచ్చింది. ‘ సుమారు18 ఏళ్ల క్రితం 13 ఏళ్ల వయసులో భారత మహిళల చెస్ టీమ్ తరఫున తొలి సారి ఆడాను. ఇవి నాకు 9వ చెస్ ఒలింపియాడ్. మన దేశం తరఫున మెడల్ సాధించి పోడియంపై నిలవాలని ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. ఇప్పుడు ఇది సాకారమైంది. పైగా నేను 9 నెలల గర్భంతో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించడం ఎంతో ఉద్వేగంగా అనిపిస్తోంది. చెస్ టోర్నమెంట్లో ఆటపై దృష్టి సారిస్తూనే డాక్టర్లు చెప్పిన జాగ్రత్తలు పాటించాను. పార్టీలు, వేడుకలు, బేబీ షవర్స్‌లాంటివన్నీ పతకం గెలిచిన తర్వాతే అనుకున్నా. ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది ‘ అని ఉబ్బితబ్బిబ్బవుతోంది మన తెలుగు తేజం.
?????
.
.
?: @FIDE_chess official olympiad website pic.twitter.com/PldBnr1lAa— Harika Dronavalli (@HarikaDronavali) August 10, 2022
బావ విషెస్..
కాగా హారిక విజయాన్ని పురస్కరించుకుని ఆమె బావ, ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బాబీ సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్పాడు. చెస్ టోర్నమెంట్‌లో మెడల్ తో హారిక తీయించుకున్న ఫొటోను షేర్ చేసిన బాబీ..’ చెస్ పట్ల ఆమెకున్న అంకితభావం సూపర్బ్. దేశం కోసం ఏదో సాధించాలన్న హారిక తపన, ఆమెలోని పోరాట పటిమను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది’ అని తన ఆనందానికి అక్షరరూపమిచ్చాడు. కాగా హారిక సోదరిని బాబీ వివాహం చేసుకున్నాడు.
Congratulations to my dearest sister in law @HarikaDronavali on winning bronze medal ?despite 9th month pregnancy at olympiad this year.? ?
You are a true fighter and we all are proud of your commitment to achieve something for our country!??
Many more to come,all the best.? pic.twitter.com/MRqDgY2Zk8— Bobby (@dirbobby) August 10, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..