సైనీ అరంగేట్రం.. మాజీలపై గౌతీ విమర్శలు!

విండీస్‌తో జరిగిన మొదటి టీ20లో టీమిండియా విజయఢంకా మోగించింది. యువ పేసర్ నవదీప్ సైనీ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి టీ20 ఆడిన సైనీ అద్భుతమైన బౌలింగ్‌తో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. అతడి అపారమైన ప్రతిభకు ఢిల్లీ రంజీ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు. అంతేకాకుండా ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులైన బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహన్‌లపై  […]

సైనీ అరంగేట్రం.. మాజీలపై గౌతీ విమర్శలు!

Updated on: Aug 03, 2019 | 11:53 PM

విండీస్‌తో జరిగిన మొదటి టీ20లో టీమిండియా విజయఢంకా మోగించింది. యువ పేసర్ నవదీప్ సైనీ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి టీ20 ఆడిన సైనీ అద్భుతమైన బౌలింగ్‌తో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు.

అతడి అపారమైన ప్రతిభకు ఢిల్లీ రంజీ జట్టు మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించాడు. అంతేకాకుండా ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులైన బిషన్ సింగ్ బేడీ, చేతన్ చౌహన్‌లపై  తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఢిల్లీ రంజీ జట్టులో నవదీప్ సైనీని తీసుకోవడానికి వారు అడ్డుపడ్డారని తెలిపాడు. అలాంటి సైనీ అరంగేట్రం మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి అదరగొట్టాడని తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇకపోతే నవదీప్ సైనీకి గంభీర్ మొదటి నుంచి మద్దతు తెలిపాడు.