FIFA World Cup: పది గంటల వ్యవధిలోనే నాలుగు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు.. మైదానంలోకి రోనాల్డో, నేమార్.. ఎక్కడ చూడాలంటే..?

|

Nov 24, 2022 | 11:16 AM

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫీఫా ప్రపంచకప్ 2022 అభిమానులను టీవీలకు, ప్రసార మాధ్యమాలకు కట్టిపడేస్తోంది. అభిమానుల సంబరాలకు ఎల్లలు లేని విధంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు అలరిస్తున్నాయి. ఆ సంబరాలను, సంతోషాలను..

FIFA World Cup: పది గంటల వ్యవధిలోనే నాలుగు ఫుట్‌బాల్ మ్యాచ్‌లు.. మైదానంలోకి రోనాల్డో, నేమార్.. ఎక్కడ చూడాలంటే..?
Fifa World Cup 2022
Follow us on

ఖతర్ వేదికగా జరుగుతున్న ఫీఫా ప్రపంచకప్ 2022 అభిమానులను టీవీలకు, ప్రసార మాధ్యమాలకు కట్టిపడేస్తోంది. అభిమానుల సంబరాలకు ఎల్లలు లేని విధంగా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు అలరిస్తున్నాయి. ఆ సంబరాలను, సంతోషాలను మరింత పెంచేలా  ఈ రోజు(గురువారం, నవంబర్ 24) ఫీఫా టోర్నమెంట్‌లో నాలుగు మ్యాచ్‌లు జరగనున్నాయి.  అంటే ఈ రోజు మొత్తం 8 జట్లు ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలోనే క్రిస్టియానో రోనాల్డో, నేమార్ నేడు తమ జట్టుల తరఫున మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి అడుగులు వేయనున్నారు. భారత కాలమానం ప్రకారం, కేవలం 10 గంటల్లో 4 మ్యాచ్‌లు జరగబోతున్నాయి.

తమ అభిమాన రొనాల్డో,నేమార్‌ను చూడాలని ఇన్ని రోజులు వేచి ఉన్న తమ కోరిక నేడు తీరబోతుందంటూ అభిమానులు గంతులు వేస్తున్నారు. అయితే నేడు ఫుట్‌బాల్ తలపడనున్న జట్లు.. స్విడ్జర్లాండ్-కామరూన్.. యురుగ్వే- దక్షిణ కొరియా.. పోర్చుగల్-గానా.. బ్రెజిల్-సెర్బియా

ఈ మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలో తెలుసా..?

మొత్తం 4 మ్యాచ్‌లు.. 9 జట్లు..

ఇవి కూడా చదవండి

ఫిఫా ప్రపంచకప్‌లో గురువారం మొత్తం 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ స్విడ్జర్లాండ్-కామరూన్ మధ్య..రెండో మ్యాచ్ యురుగ్వే- దక్షిణ కొరియా మధ్య.. మూడో మ్యాచ్ పోర్చుగల్-ఘనా మధ్య, చివరి మ్యాచ్ అర్థరాత్రి బ్రెజిల్-సెర్బియా మధ్య జరగనుంది.

భారత కాలమానం ప్రకారం..

భారత కాలమానం ప్రకారం.. మొదటి మూడు మ్యాచ్‌లు నవంబర్ 24న.. అలాగే చివరి మ్యాచ్ నవంబర్ 25న జరుగుతాయి.

FIFA ప్రపంచ కప్ 2022 యొక్క నాలుగు మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?

భారత కాలమానం ప్రకారం స్విట్జర్లాండ్, కామెరూన్ మధ్య మధ్యాహ్నం 3:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇది కాకుండా ఉరుగ్వే వర్సెస్ సౌత్ కొరియా మ్యాచ్ సాయంత్రం 6:30 గంటలకు, పోర్చుగల్ వర్సెస్ ఘనా మ్యాచ్ రాత్రి 9:30 గంటలకు జరగనుంది. అలాగే బ్రెజిల్, సెర్బియా జట్లు మధ్యాహ్నం 12.30 గంటలకు పోటీపడనున్నాయి.

ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ చూడాలి..

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా.. గురువారం జరగనున్న నాలుగు మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం స్పోర్ట్స్18 , స్పోర్ట్స్18 హెచ్‌డిలో చూడవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..