Football Player: ఇటుకల బట్టీలో రోజువారీ కార్మికురాలిగా పని చేస్తున్న ఫుట్ బాల్ క్రీడాకారిణికి రూ. లక్ష సాయం, ఉద్యోగం కూడా !

| Edited By: Phani CH

May 24, 2021 | 2:11 PM

ఝార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లాలో కుటుంబ పోషణ కోసం ఇటుకల బట్టీలో పని చేస్తున్న ఫుట్ బాల్ క్రీడాకారిణి సంగీతా సొరేన్ కి ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందజేసింది.

Football Player: ఇటుకల బట్టీలో రోజువారీ కార్మికురాలిగా పని చేస్తున్న ఫుట్ బాల్ క్రీడాకారిణికి రూ. లక్ష సాయం, ఉద్యోగం కూడా !
Sangita Soren
Follow us on

ఝార్ఖండ్ లోని ధన్ బాద్ జిల్లాలో కుటుంబ పోషణ కోసం ఇటుకల బట్టీలో పని చేస్తున్న ఫుట్ బాల్ క్రీడాకారిణి సంగీతా సొరేన్ కి ప్రభుత్వం ఆర్ధిక సహాయాన్ని అందజేసింది. కోవిద్ పాండమిక్ కారణంగా విధిలేని పరిస్థితుల్లో తన తల్లి, అన్నతో బాటు ఇటుకల బట్టీలో ఈమె పని చేస్తున్న విషయం తెలుసుకుని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఆమెకు తక్షణ సాయం అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఆమె ఉంటున్న బాగ్మారా గ్రామానికి బ్లాక్ డెవలప్ మెంట్ అధికారి చేరుకొని ఆమెకు రూ. లక్ష సాయాన్ని అందజేశారు. ధన్ బాద్ లో ఫుట్ బాల్ ట్రెయినింగ్ కోచ్ గా ఆమెకు ఉద్యోగం కల్పిస్తామని ఆయన చెప్పారు. అటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా సంగీత దీన స్థితి తెలుసుకుని ఆర్ధిక సహాయం చేస్తామని ప్రకటించారు. ఈమేరకు క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 20 ఏళ్ళ ఈ క్రీడాకారిణి 2018=19 లో ఇండియా తరఫున భూటాన్, థాయిలాండ్ లలో జరిగిన అండర్ 17, అండర్ 18 ఫుట్ బాల్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది.

తనకు ఝార్ఖండ్ ప్రభుత్వం చేసిన సాయానికి సంగీతకృతఙ్ఞతలు తెలిపింది. ఈమెను సర్కార్ ఆదుకున్నందుకు గ్రామస్థులు కూడా హర్షం వ్యక్తం చేశారు. సంగీత వంటి ఫుట్ బాల్ క్రీడాదికారిణులు మరిన్ని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని తమ గ్రామానికి పేరు తెస్తారని వారు అంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Corona Effect: కరోనా ఎఫెక్ట్‌తో భారీగా తగ్గిన కార్ల కొనుగోళ్లు.. పుంజుకోనున్న పాత కార్ల బిజినెస్‌

MP RRR Bail: ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదలపై కొనసాగుతున్న టెన్షన్.. నాలుగు రోజుల తర్వాతే బయటకు..!