FIFA World Cup 2022: అదిరింది.. ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ‘పాండా’ చెప్పిన టీమే గెలిచిందీగా..

| Edited By: Narender Vaitla

Dec 18, 2022 | 11:36 PM

FIFA World Cup 2022 Final: ఫుట్ బాల్ వరల్డ్‌ కప్‌లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పించుకోవడం ఫుట్ బాల్ ప్రేమికులకు కొత్తేం కాదు. అందులో భాగంగానే ఈ సారి పాండాలు జోస్యం చెప్పాయి.

FIFA World Cup 2022: అదిరింది.. ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో పాండా చెప్పిన టీమే గెలిచిందీగా..
Panda Prediction
Follow us on

ఫుట్ బాల్ వరల్డ్‌ కప్‌లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పించుకోవడం ఫుట్ బాల్ ప్రేమికులకు కొత్తేం కాదు. అందులో భాగంగానే ఈ సారి పాండాలు జోస్యం చెప్పాయి. తురియా, సుహైల్ అనే రెండు పాండాలు ఈ సారి అర్జెంటీనాను విజేతగా ఎంపిక చేశాయి. ఈ వీడియోను ఖతర్ బ్రాడ్ కాస్టర్ బిఇన్ స్పోర్ట్స్ రికార్డు చేసింది. అయితే ఈ సారి కూడా పాండాలు చెప్పినట్టే అర్జెంటీనా విజయం సాధించడం విశేషం. ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా విజయాన్ని అందుకొని ప్రపంచకప్ ను సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి ఫ్రాన్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో విజయం సాధించి సుదీర్ఘ కాలం తర్వాత వరల్డ్ కప్ ను ముద్దాడింది. పెనాల్టీ షూటౌట్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించింది.

ఇక అంతకు ముందు మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.  ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగించింది. ఏకంగా రెండు గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ గోల్స్ ఏమీ చేయలేకపోయింది. కానీ.. సెకండాఫ్‌లో నెమ్మదిగా పుంజుకుంది. బ్యాక్‌ టు బ్యాక్‌ గోల్స్‌తో ఆటగాళ్లలో ఉత్సాహం వచ్చింది.

అర్జెంటీనా స్టార్‌ ప్లేయర్‌ మెస్సి.. మరోసారి మెస్మరైజ్‌ చేశాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలి గోల్‌ కొట్టి.. అర్జెంటీనా అభిమానుల్లో జోష్‌ నింపాడు. అదే ఉత్సాహంతో ఆడిన ఆటగాళ్లు ఫ్రాన్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ప్లేయర్‌ డి-మారియా రెండో గోల్‌ చేశాడు. అలా ఫస్టాఫ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది అర్జెంటీనా. ఫ్రాన్స్‌ కోలుకునేందుకు అవకాశమే ఇవ్వలేదు. సెకండాఫ్‌ నిర్ణీత సమయం ముగిసే సరికి ఫ్రాన్స్‌ కూడా రెండు గోల్స్‌ చేయడంతో సమయం పొడిగించారు.

ఇవి కూడా చదవండి

మెస్సీ సరికొత్త రికార్డ్..

ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లియోనెల్ మెస్సీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక ప్రపంచకప్‌ టోర్నీ‌లో గ్రూప్‌ లెవల్‌లో, క్వార్టర్‌ ఫైనల్స్‌లో, సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌లోను గోల్‌ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..