Commonwealth Games2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022 తుది అంకానికి చేరుకున్నాయి. నేటితో ఈ ప్రతిష్ఠాత్మక గేమ్స్ ముగియనున్నాయి. ఇక ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం17 బంగారు పతకాలతో సహా మొత్తం మీద 55 పతకాలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. క్రీడలు ముగియడానికి ఇంకో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో భారత్ ఖాతాలో మరికొన్ని పతకాలు చేరే అవకాశముంది.
నాలుగో స్థానం కోసం పోటాపోటీ..
కాగా బాక్సింగ్‌తో పాటు అథ్లెటిక్స్ పరంగా భారతదేశానికి ఆదివారం (ఆగస్టు 7) చాలా మంచి రోజు. బాక్సింగ్‌లో మూడు స్వర్ణాలు, ఒక రజతం రాగా.. అదే సమయంలో అథ్లెటిక్స్‌లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ట్రిపుల్ జంప్‌లో స్వర్ణం, రజతం సొంతం చేసుకున్నారు . ఆదివారం అథ్లెటిక్స్‌లో 1 స్వర్ణం, 2 రజతం, ఒక కాంస్యం సహా మొత్తం 4 పతకాలు వచ్చాయి. ఇవి కాకుండా టేబుల్ టెన్నిస్‌లో ఒక స్వర్ణం, ఒక కాంస్యం కూడా దక్కాయి. అదేవిధంగా హాకీలో కాంస్యం, మహిళల టీ20 క్రికెట్‌లో రజతం వచ్చాయి. బ్యాడ్మింటన్‌లో రెండు కాంస్యాలు వచ్చాయి. ఇలా ఆదివారం మొత్తం 5 స్వర్ణాలు గెల్చుకున్న భారత్ ఖాతాలో ఇప్పుడు మొత్తం 18 స్వర్ణాలుఉన్నాయి. దీంతో న్యూజిలాండ్‌ను అధిగమించి నాలుగో స్థానానికి చేరుకుంది. అయితే కివీస్‌కు, భారత జట్టుకు ఒక స్వర్ణం మాత్రమే తేడా ఉంది. నాలుగో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీ పడుతున్నాయి.
సింధు మ్యాచ్ పైనే దృష్టి..
కాగా బ్యాడ్మింటన్‌లో మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్ ఫైనల్స్‌లో ఆగస్టు 8వ తేదీ సోమవారం జరిగే ఫైనల్స్‌లో భారత్‌కి స్వర్ణం గెలిచే అవకాశం ఉంది. ఇవే కాకుండా టీటీడీ ఫైనల్ కూడా ఉంది. అదే సమయంలో ఎక్కువ మంది దృష్టి భారత్- ఆస్ట్రేలియా పురుషుల హాకీ ఫైనల్స్‌పైనే ఉంది. ఇక పతకాల పట్టికలో 66 స్వర్ణాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో, 55 స్వర్ణాలతో ఇంగ్లండ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.
As we enter the final day of #B2022, here’s how the medal table looks at the end of Day 10.
1️⃣ @CommGamesAUS
2️⃣ @TeamEngland
3️⃣ @CwthSportCANTune in tomorrow to see if it changes ?#Birmingham2022 #commonwealthgames pic.twitter.com/uUKmT34V5k
— Birmingham 2022 (@birminghamcg22) August 7, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..