AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ZIM vs IND: జింబాబ్వేతో మొదటి టీ20 మ్యాచ్.. టీమిండియా తరఫున ముగ్గురి యంగ్ ప్లేయర్ల అరంగేట్రం

శుభ్‌మన్ గిల్ తొలిసారిగా టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి కెప్టెన్సీలోనే విజయభేరీ మోగించాలనే ఉద్దేశంతో గిల్ రంగంలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున ముగ్గురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు

ZIM vs IND: జింబాబ్వేతో మొదటి టీ20 మ్యాచ్.. టీమిండియా తరఫున ముగ్గురి యంగ్ ప్లేయర్ల అరంగేట్రం
Zim Vs Ind T20 Match
Basha Shek
|

Updated on: Jul 06, 2024 | 5:10 PM

Share

టీ20 ప్రపంచకప్ గెలిచిన వారం తర్వాత భారత జట్టు తొలిసారిగా మైదానంలోకి అడుగుపెట్టింది. భారత్-జింబాబ్వే మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం (జులై06) హరారే వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ టీమ్‌లో టీ20 ప్రపంచ చాంపియన్‌ జట్టు సభ్యులు లేకపోయినా.. అందులో భాగమైన పలువురు యువ ఆటగాళ్లు జట్టుకు ఆడుతున్నారు. శుభ్‌మన్ గిల్ తొలిసారిగా టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తొలి కెప్టెన్సీలోనే విజయభేరీ మోగించాలనే ఉద్దేశంతో గిల్ రంగంలోకి దిగుతున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా ఈ మ్యాచ్ లో టీమిండియా తరఫున ముగ్గురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. వారెవరంటే.. అభిషేక్ శర్మ, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్. అభిషేక్ శర్మ, పరాగ్‌లకు ఇది మొదటి అంతర్జాతీయ మ్యాచ్ కాగా, ధృవ్ జురెల్ ఇప్పటికే టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే టీ20ల్లో తొలిసారిగా బరిలోకి దిగుతున్నాడు.

అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ IPL 2024లో తమ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు పరాగ్. అలాగే, ఈ సీజన్‌లో అత్యంత విజయవంతమైన మూడో బ్యాట్స్‌మెన్‌గా పరాగ్ నిలిచాడు. అతను 16 మ్యాచ్‌ల్లో 149.22 స్ట్రైక్ రేట్‌తో 573 పరుగులు చేశాడు. ఇందులో 4 అర్ధశతకాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో, అభిషేక్ శర్మ IPL 2024 లో 16 మ్యాచ్‌లలో 204.22 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 484 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల వివరాలివే

టీమ్ ఇండియా:

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, ర్యాన్ పరాగ్, రింకూ సింగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

జింబాబ్వే జట్టు:

తాడివానాషే మారుమణి, ఇన్నోసెంట్ కయా, బ్రియాన్ బెన్నెట్, సికందర్ రజా (కెప్టెన్), డియోన్ మైయర్స్, జొనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మడ్నాడే (వికెట్ కీపర్), వెస్లీ మాధేవేర్, ల్యూక్ జోంగ్వే, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..