India A vs Newzeland A: స్వదేశంలో న్యూజిలాండ్- ఏ జట్టుతో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం సంజూశాంసన్ నేతృత్వంలో మొత్తం 16 మంది సభ్యులను ఎంపిక చేసింది. దేశవాళీ క్రికెట్‌తో పాటు గత సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన హైదరబాదీ క్రికెటర్ తిలక్‌వర్మ (Tilak Varma)కు బీసీసీఐ నుంచి తొలిసారి పిలుపువచ్చింది. అతనితో పాటు ఆంధ్రాకు చెందిన వికెట్ కీపర్ కేఎస్ భరత్ (KS Bharat)కు కూడా స్థానం లభించింది. కాగా ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2022లో అరంగేట్రం చేసిన తిలక్ వర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లాడిన తిలక్ వర్మ 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, అప్పటి కోచ్ మహేశ జయవర్దనే వంటి ప్రముఖులు తిలక్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు.
కాగా మూడు టెస్టు, మూడు వన్డేల అనధికారిక సిరీస్ ఆడే నిమిత్తం న్యూజిలాండ్ ఏ జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి రెండు టెస్టులు డ్రాగా ముగియగా.. మూడో టెస్టు ఇంకా కొనసాగుతోంది. ఈ టెస్టు సిరీస్ తర్వాత సెప్టెంబరు 22, 25, 27 తేదీల్లో వన్డే సిరీస్‌లో భారత ఏ జట్టు, కివీస్ ఏ జట్టుతో తలపడనుంది. తమిళనాడులోని చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి.
భారత్ A: సంజు శాంసన్ (కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, రాహుల్ త్రిపాఠి, రజత్ పటీదార్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, షాబాజ్ అహ్మద్, రాహుల్ చాహర్, తిలక్ వర్మ, కుల్దీప్ సేన్, శార్దూల్ ఠాకూర్, ఉమ్రాన్ మాలిక్ , నవదీప్ సైనీ, రాజాంగద్ బావా.
NEWS – India “A” squad for one-day series against New Zealand “A” announced.
Sanju Samson to lead the team for the same.
More details here ??https://t.co/x2q04UrFlY
— BCCI (@BCCI) September 16, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..