- Telugu News Sports News Cricket news Yashasvi Jaiswal, Shreyas Iyer Fail in Duleep Trophy 2025 Semi Final
Duleep Trophy: ఆసియా కప్ స్వ్కాడ్‌లో చోటు.. కట్‌చేస్తే.. సింగిల్ డిజిట్ దాటకుండానే ఔట్..
Duleep Trophy 2025 Semi Final: ఆసియా కప్ జట్టులో చోటు దక్కని యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ దులీప్ ట్రోఫీలో నిరాశపరిచాడు. వెస్ట్ జోన్ జట్టు తరపున ఆడుతున్న అతను కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో ఇద్దరూ బాగా రాణిస్తారని భావిస్తున్నారు.
Updated on: Sep 04, 2025 | 8:25 PM

ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన తర్వాత నిరాశ చెందిన టీం ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, ఈరోజు ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ జట్టు తరపున మైదానంలోకి దిగాడు. అయితే, ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ సింగిల్ కూడా దాటలేకపోయాడు.

దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్ వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో, వెస్ట్ జోన్ జట్టు తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్, మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 3 బంతుల్లోనే 4 పరుగులు చేసి, ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యుగా ఔటయ్యాడు.

బెంగళూరులో జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండవ సెమీఫైనల్లో, శార్దూల్ ఠాకూర్ నేతృత్వంలోని వెస్ట్ జోన్ జట్టు పేలవమైన ఆరంభాన్ని ఇచ్చింది. వారి ఓపెనర్లు ఇద్దరూ 10 పరుగుల వ్యవధిలోనే అవుట్ అయ్యారు. ఇంగ్లాండ్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన యశస్వి జైస్వాల్ కేవలం 3 బంతుల్లో 4 పరుగులకే అవుట్ కాగా, మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్ 1 పరుగుకే అవుట్ అయ్యాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో యశ్వసి జైస్వాల్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఈ పర్యటనలో ఆడిన 5 మ్యాచ్‌లలో 10 ఇన్నింగ్స్‌లలో 41.10 సగటుతో 411 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు, దులీప్ ట్రోఫీలో యశ్వసి కూడా అదే చేస్తాడని భావించారు. కానీ, మొదటి ఇన్నింగ్స్‌లో యశ్వసి ప్రదర్శన పేలవంగా ఉంది.

యశస్వి జైస్వాల్‌తో పాటు, ఆసియా కప్ జట్టులో చోటు దక్కకపోవడంతో బాధపడ్డ మరో అనుభవజ్ఞుడైన బ్యాట్స్ మెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో నమ్మదగిన ప్రదర్శన ఇవ్వలేదు. జట్టు తరపున ఐదో స్థానంలో మైదానంలోకి వచ్చిన శ్రేయాస్ 28 బంతుల్లో 25 పరుగులు చేసి ఒక వికెట్ ఇచ్చాడు. ఇప్పుడు, రెండవ ఇన్నింగ్స్ లో వారిద్దరి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించవచ్చు.




