AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్స్‌ డేట్‌ ఫిక్స్‌!! తుదిపోరుకు చేరాలంటే టీమిండియా లెక్కలివే

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌ ఆడడం ఖాయం. అయితే 2వ జట్టుగా ఫైనల్‌లోకి ప్రవేశించేందుకు భారత్, శ్రీలంక మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆస్ట్రేలియాతో జరగనున్న 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0 లేదా 3-1 లేదా 2-0 తేడాతో గెలిస్తే టీమ్ ఇండియా నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు.

WTC Final: వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్స్‌ డేట్‌ ఫిక్స్‌!! తుదిపోరుకు చేరాలంటే టీమిండియా లెక్కలివే
Indian Cricket Team
Basha Shek
|

Updated on: Jan 22, 2023 | 7:00 AM

Share

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు తేదీ ఖరారైంది. WTC ఫైనల్స్ జూన్ 8-12 నుండి జరగనుంది. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోవడంతో రిజర్వ్‌డే ఉంటుంది. ఈసారి ఇంగ్లండ్‌లోని ఓవల్‌ మైదానం వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. కాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌ ఆడడం ఖాయం. అయితే 2వ జట్టుగా ఫైనల్‌లోకి ప్రవేశించేందుకు భారత్, శ్రీలంక మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆస్ట్రేలియాతో జరగనున్న 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 3-0 లేదా 3-1 లేదా 2-0 తేడాతో గెలిస్తే టీమ్ ఇండియా నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు. ఎందుకంటే 2-0 తేడాతో గెలిచినా టీమ్ ఇండియాకు 60.65% పాయింట్లు వస్తాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు పాయింట్లు 63.16 శాతానికి పడిపోతాయి. తద్వారా ఫైనల్‌లో ఇరు జట్లు తలపడవచ్చు. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లో టీమిండియా ఓడిపోతేనే శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. ఆస్ట్రేలియాపై టీమిండియా 3-1 లేదా 2-0, 1-0 తేడాతో ఓడిపోతే శ్రీలంక జట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక లంక జట్టు న్యూజిలాండ్‌తో జరిగే 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో గెలిస్తే నేరుగా ఫైనల్‌లోకి ప్రవేశించవచ్చు. కాబట్టి ఆస్ట్రేలియాపై భారత్ తప్పనిసరిగా 4-0 లేదా 3-1 లేదా 3-0 లేదా 2-0 తేడాతో గెలవాలి. 2-2తో సిరీస్‌ను సమం చేస్తే మాత్రం శ్రీలంక- న్యూజిలాండ్ మ్యాచ్‌ రిజల్డ్‌పై ఆధారపడాల్సిందే.

ఎందుకంటే ఆస్ట్రేలియాపై భారత్ 4-0తో గెలిస్తే 68.06% మార్కులు వస్తాయి. 3-1 గెలిస్తే 62.5%, 2-0 గెలిస్తే 60.65%. సిరీస్ 2-2తో డ్రా అయితే 56.94% పాయింట్లు మాత్రమే. న్యూజిలాండ్‌పై 2-0తో గెలిస్తే శ్రీలంక 60% పాయింట్లు పొందవచ్చు. దీంతో టీమ్ ఇండియా ఫైనల్‌ రేసు నిష్క్రమించనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌లోకి ప్రవేశించడానికి ప్లస్ పాయింట్ ఏమిటంటే, భారత జట్టు ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్ ఆడనుంది. అదే సమయంలో శ్రీలంక జట్టు న్యూజిలాండ్‌లో సిరీస్ ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్‌లో శ్రీలంక ఇప్పటివరకు టెస్టు సిరీస్‌ను గెలవలేదు. తద్వారా స్వదేశంలో ఆడుతున్న భారత జట్టుకు విజయావకాశాలు పెరిగాయి. కాబట్టి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మళ్లీ భారత జట్టును చూసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..