WTC Final 2023: టార్గెట్ 444.. టీమిండియా ఛేదించేనా.. చతికిలపడేనా? ఓవల్ హిస్టరీలో అత్యధిక ఛేదన ఎంతంటే?

|

Jun 10, 2023 | 7:07 PM

Australia vs India: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల టార్గెట్ నిలిచింది.

WTC Final 2023: టార్గెట్ 444.. టీమిండియా ఛేదించేనా.. చతికిలపడేనా? ఓవల్ హిస్టరీలో అత్యధిక ఛేదన ఎంతంటే?
Wtc Final
Follow us on

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ నాలుగో రోజు రెండో సెషన్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసింది. దీంతో టీమిండియా ముందు 444 పరుగుల టార్గెట్ నిలిచింది. అలెక్స్ కారీ 66 పరుగులతో అజేయంగా నిలిచాడు. పాట్ కమిన్స్ 5 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కాగా, క్యారీ కెరీర్‌లో నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

33 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ అవుటయ్యాడు. మహ్మద్ షమీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ చేతికి చిక్కాడు. అంతకుముందు కెమెరూన్ గ్రీన్ (25 పరుగులు) రవీంద్ర జడేజాకు బలయ్యాడు. మార్నస్ లబుషేన్ (41 పరుగులు) ఉమేష్ యాదవ్ పెవిలియన్ చేర్చాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఓవల్ చరిత్రను పరిశీలిస్తే 1902లో అత్యధిక పరుగుల ఛేదన జరిగింది.  ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 263 పరుగుల లక్ష్యాన్ని సాధించింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ఛేదనగా నిలిచింది.

ఇరుజట్లు:

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.