WTC Final 2023: టెస్ట్ ఫైనల్ మ్యాచ్‌కి అనుకోని అతిథులు.. ఎందుకొస్తున్నారో తెలిస్తే ఫ్యాన్స్‌కి పునకాలే..

|

Jun 03, 2023 | 12:41 PM

WTC Final 2023: క్రికెట్ అభిమానులకు రెండు నెలలపాటు వినోదం పంచి పెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిపోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మీద పడింది. లండన్ ఒవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి..

WTC Final 2023: టెస్ట్ ఫైనల్ మ్యాచ్‌కి అనుకోని అతిథులు.. ఎందుకొస్తున్నారో తెలిస్తే ఫ్యాన్స్‌కి పునకాలే..
Ganguly And Harbhajan To Be Commentators For WTC Final
Follow us on

WTC Final 2023: క్రికెట్ అభిమానులకు రెండు నెలలపాటు వినోదం పంచి పెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిపోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మీద పడింది. లండన్ ఒవల్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి ఇంకా 4 రోజులే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే హక్కులను పొందిన  స్టార్ స్పోర్ట్స్ తమ కామెంటరీ ప్యానెల్‌ను తాజాగా ప్రకటించింది. ఈ కామెంటరీ ప్యానెల్‌‌లో టీమిండియాకు చెందిన పలువురు మాజీ దిగ్గజాలు కూడా ఉండడం విశేషం. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా చాలాకాలం తర్వాత  మైక్ పట్టుకోబోతున్నాడు. అలాగే హర్భజన్ సింగ్ కూడా ఈ సారి కామెంటరీ ఇవ్వనున్నాడు. అయితే గంగూలీ ఇంగ్లీష్ కామెంటరీ ప్యానెల్‌లో కాకుండా హిందీలో కామెంటరీ చెప్పనున్నాడు. ఎంతో కాలం తర్వాత కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్న గంగూలీ వార్త తెలిసి ఇప్పటికే పలువురు క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏయే భాషలలో ఎవరెవరు కామెంటరీ ఇవ్వనున్నారో ఇప్పుడు చూద్దాం..

కామెంటరీ ప్యానెల్ వివరాలు

ఇంగ్లీష్ కామెంటేటర్స్: రవిశాస్త్రి, హర్షా భోగ్లే , నాసిర్ హుస్సేన్, దినేశ్ కార్తీక్, రికీ పాంటింగ్, మాథ్యూ హెడెన్, జస్టిన్ లాంగర్, కుమార సంగక్కర, సునీల్ గవాస్కర్

హిందీ కామెంటేటర్స్: సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్, ఎస్.శ్రీశాంత్, జతిన్ సప్రూ, దీప్ దాస్ గుప్తా

తమిళ్ కామెంటేటర్స్: యో మహేశ్, ఎస్. రమేశ్, లక్ష్మీపతి బాలాజీ, ఎస్. శ్రీరామ్

తెలుగు కామెంటేటర్స్: కౌశిక్, ఆశిష్ రెడ్డి, టి.సుమన్, కె. కళ్యాణ్

కన్నడ కామెంటేటర్స్: విజయ్ భరద్వాజ్, శ్రీనివాస. ఎం, బి. చిప్లి, పవన్ దేశ్‌పాండే, సునీల్ జోషీ

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు ఇరు జట్లు :

భారత్:  రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్

స్టాండ్ బై ప్లేయర్స్: యశస్వీ  జైస్వాల్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్

ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హెజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, టాడ్  మర్ఫీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్

స్టాండ్ బై ప్లేయర్స్: మిచెల్ మార్ష్, మాథ్యూ రెన్‌షా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..