WTC Final: అంపైర్‌కు కళ్లు దొబ్బాయా ఏంది.. ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ కనబడలేదా: పాక్ క్రికెటర్ ఆరోపణలు..
IND vs AUS: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఆస్ట్రేలియాపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆస్ట్రేలియా టీం బాల్ టెంపరింగ్‌కు పాల్పడినట్లు అతడు పేర్కొన్నాడు. విరాట్ కోహ్లి, పుజారాలను ఔట్ చేసేందుకు ఆస్ట్రేలియా ఇలా చేసిందని, అయితే ఆశ్చర్యకరంగా ఎవరూ దానిని గమనించలేదని బాసిత్ అలీ చెబుతున్నాడు.

Ball Tampering: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టుపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. కంగారూ జట్టుపై పాకిస్థాన్ క్రికెటర్ ఈ ఆరోపణలు చేశాడు. బాల్ టెంపరింగ్ జరిగిందని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, ఛెతేశ్వర్ పుజారాలను అవుట్ చేసేందుకు ఆస్ట్రేలియా బాల్ టెంపరింగ్ చేసిందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ పేర్కొన్నాడు. అయితే ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదంటూ చెప్పుకొచ్చాడు.
బాసిత్ అలీ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, “కామెంటరీ బాక్స్‌లో కూర్చున్న లేదా మైదానంలో నిలబడి ఉన్న అంపైర్‌కు ఇవి కనబడలేదు. ఆస్ట్రేలియా బాల్ టాంపరింగ్ ఎలా చేసిందో స్పష్టంగా చూపించారు. కానీ, వాళ్ల గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఆశ్చర్యపోలేదు?” అంటూ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా బాల్ టెంపరింగ్ చేసింది: పాక్ క్రికెటర్ ఆరోపణలు..
భారత ఇన్నింగ్స్‌లో 16, 18వ ఓవర్లలో ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ చేసిందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పాక్ మాజీ క్రికెటర్ చెప్పాడు. ఇందుకోసం పుజారా, విరాట్ కోహ్లీ వికెట్లను స్పష్టంగా పేర్కొన్నాడు. 18వ ఓవర్ సమయంలో బంతి ఆకారం క్షీణించడంతో అంపైర్ సూచనల మేరకు మార్చినట్లు బాసిత్ తెలిపాడు. కానీ మళ్లీ మైదానంలోకి బంతుల పెట్టె రాగానే కొత్త బంతి తీశారు.
View this post on Instagram
అలీ 16, 17 మరియు 18వ ఓవర్ల ఉదాహరణను ఇక్కడ ప్రస్తావించాడు. విరాట్ కోహ్లీ ఔట్ అయిన బంతిని కూడా ప్రస్తావించాడు. ఆ బంతి మెరుపును మీరు చూస్తున్నారని పాకిస్థానీ వెటరన్ తెలిపాడు. మిచెల్ స్టార్క్ చేతిలో ఉన్న బంతిలో, దాని మెరిసే భాగం బయట ఉంది. అదేవిధంగా, జడేజా షాట్ ఆడినప్పుడు, అతను బంతిని ఆన్ సైడ్ వైపు కొట్టాడు. కానీ, బంతి ఓవర్ పాయింట్ దాటి పోయింది. అంపైర్ అంధుడిగా ఉన్నాడా అనేది నా ప్రశ్న. ఈ విషయం అక్కడ కూర్చున్న వారెవరికీ ఎందుకు కనిపించలేదో పై వాడికే తెలుసు అంటూ ఆరోపణలు గుప్పించాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




