WTC Final 2023: రోహిత్ ఎదుట రెండు భారీ సవాళ్లు.. కోహ్లీ బ్యాడ్‌నేమ్‌కు వారసుడవుతాడా.. ధోనీలా దూసుకెళ్తాడా?

|

Jun 02, 2023 | 12:33 PM

WTC Final 2023: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. ఓవల్‌లో గెలిచిన జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుంది.

WTC Final 2023: రోహిత్ ఎదుట రెండు భారీ సవాళ్లు.. కోహ్లీ బ్యాడ్‌నేమ్‌కు వారసుడవుతాడా.. ధోనీలా దూసుకెళ్తాడా?
Wtc Final Rohit Sharma
Follow us on

WTC Final 2023: 2022 ప్రారంభంలో టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ రాజీనామా చేశాడు. ఐసీసీ టోర్నీల్లో కోహ్లీ నాయకత్వంలో భారత జట్టు ట్రోఫీని గెలవకపోవడమే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణంగా నిలిచిందంటూ వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బీసీసీఐ రోహిత్ శర్మకు టీమిండియా సారథ్య బాధ్యతలు అప్పగించింది. టీ20 ప్రపంచ కప్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, వన్డే ప్రపంచ కప్‌లను దృష్టిలో ఉంచుకుని BCCI నాయకత్వాన్ని మార్చేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు.

కానీ, హిట్‌మ్యాన్ సారథ్యంలో టీమిండియా ఫైనల్స్‌లోకి ప్రవేశించలేకపోయింది. ఆసియా కప్‌లోనూ ఓడిపోయింది. ఇప్పుడు మరో ఫైనల్ పోరు రోహిత్ శర్మ ముంగిట నిలిచింది. ఓవల్ వేదికగా జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియాకు విజయం అనివార్యం.

ఇవి కూడా చదవండి

ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక కూడా భారత జట్టు ఐసీసీ టోర్నీని గెలవలేదు. కాబట్టి, అన్ని అంచనాలు ఇప్పుడు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై ఉన్నాయి. దీని తర్వాత వన్డే ప్రపంచకప్ కూడా రానుంది.

ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌నకు అవకాశం లేకుండా పోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్, వన్డే ప్రపంచకప్‌పై టీమిండియా కన్నేసింది. ముఖ్యంగా, జట్టును ఛాంపియన్‌గా చేయడం ద్వారా బీసీసీఐ నాయకత్వ మార్పు సరైనదని నిరూపించాల్సిన అవసరం రోహిత్ శర్మకు ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..