WPL 2024: ఇవాళ ఎలిమినేటర్‌.. ఫైనల్ టికెట్ కోసం ముంబై, బెంగళూరు బిగ్ ఫైట్‌..హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే

WPL 2024 Eliminator: మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో భాగంగా శుక్రవారం (మార్చి 15) కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్‌ వేదికగా జరిగే ఈ హోరాహోరీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.

WPL 2024: ఇవాళ ఎలిమినేటర్‌.. ఫైనల్ టికెట్ కోసం ముంబై, బెంగళూరు బిగ్ ఫైట్‌..హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే
WPL 2024 Eliminator

Updated on: Mar 15, 2024 | 8:50 AM

 

WPL 2024 Eliminator: మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో భాగంగా శుక్రవారం (మార్చి 15) కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్‌ వేదికగా జరిగే ఈ హోరాహోరీ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని ముంబై జట్టు రెండో స్థానంలో నిలవగా, RCB మూడో స్థానంలో నిలిచింది. ఇక బుధవారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెగ్ లానింగ్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు మళ్లీ విజయం సాధించి ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. గత సీజన్‌లోనూ ఢిల్లీ తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. అయితే ఫైనల్‌లో ముంబై చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ శుక్రవారం (మార్చి 15) రెండో ఫైనలిస్ట్‌గా మారేందుకు ముంబై ఇండియన్స్, RCB జట్లు పోటీపడుతున్నాయి. బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడగా, నాలుగింటిలో విజయం సాధించింది. అదే సమయంలో ముంబై ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడ్డాయి. ఒక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు గెలుపొందగా, మరొక మ్యాచ్‌ లో RCB గెలిచింది. ఇదిలా ఉంటే, గత సీజన్‌లో కూడా రెండు జట్ల మధ్య రెండు లీగ్ మ్యాచ్‌లు జరగగా, రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

మార్చి 12న జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీ ధీటైన ప్రదర్శన చేసి కేవలం 15 పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించిన పెర్రీ అజేయంగా 40 పరుగులు చేసింది. పెర్రీ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ముంబై 19 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత ఆర్‌సీబీ 15 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎల్లిస్ పెర్రీ చిరస్మరణీయమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో RCB ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ ఇదే ప్రదర్శన ఆశిస్తోంది ఆర్సీబీ యాజమాన్యం

రెండు జట్లు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

స్మృతి మంధాన (కెప్టెన్), దిశా కస్సట్, సబ్బినేని మేఘన, ఆశా శోభన, ఎల్లిస్ పెర్రీ, జార్జియా వేర్‌హామ్, నాడిన్ డి క్లర్క్, రాంకా పాటిల్, శుభా సతీష్, సోఫీ డివైన్, ఇంద్రాణి రాయ్, రిచా ఘోష్, ఏక్తా ఘోష్, ఏక్తా బిష్స్, రేణుకా సింగ్, శ్రద్ధా పోకర్కర్, సిమ్రాన్ బహదూర్, సోఫీ మోలినెక్స్.

ముంబై ఇండియన్స్:

హర్మన్‌ప్రీత్ కౌర్, అమన్‌దీప్ కౌర్, అమేలియా కెర్, క్లో ట్రయోన్, అలిస్సా మాథ్యూస్, హుమైరా కాజీ, ఇసాబెల్ వాంగ్, జింథిమణి కలిత, కృత్నా బాలకృష్ణన్, నటాలీ సీవర్ బ్రంట్, పూజా వస్త్రాకర్, సజీవన్ సజ్నా, ప్రియాంక బాలా, శాబ్ ఇషాకిమ్, సబిన్ ఇషాకిమ్ ఇస్మాయిల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..