IND vs BAN: తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

|

Dec 18, 2022 | 2:01 PM

తొలిటెస్ట్‌ మ్యాచ్‌లో 188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై టీంఇండియా ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో..

IND vs BAN: తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం
India Beat Bangladesh
Follow us on

తొలిటెస్ట్‌ మ్యాచ్‌లో 188 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై టీంఇండియా ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 513 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 324 పరుగులకే ఆలౌటైంది. దీంతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరేందుకు భారత్‌ మరో అడుగు వేసింది. టీమిండియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో శ్రీలంకను దాటి మూడో స్థానానికి ఎగబాకింది. ఇక తొలి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియా 75 శాతం, దక్షిణాఫ్రికా 60 శాతంలో ఉన్నాయి. టీంఇండియా 55.7 శాతంతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత జరగబోయే ఐదు టెస్టుల్లో కనీసం నాలుగింటిలో విజయం సాధిస్తే టీంఇండియా ఫైనల్‌కు చేరుకుంటుంది.

ఇప్పటివరకు జరిగిన డబ్ల్యూటీసీ 2021-23 సీజన్‌లో ఇప్పటి వరకు భారత్‌ 7 మ్యాచ్‌లు ఆడింది. వాటిల్లో 5 మ్యాచ్‌లలో టీంఇండియా గెలవగా, 2 మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. టెస్టు సిరీస్‌లో భాగంగా భారత్‌ తదుపరి నాలుగు మ్యాచ్‌లు స్వదేశంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.