
విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరుకున్న క్రేజ్ వేరు. మైదానంలో బౌలర్లపై ఎలాంటి దయ చూపకుండా పరుగుల వర్షం కురిపించే విరాట్ బయట ఎంతో సరదాగా ఉంటాడు. ముఖ్యంగా తనను అభిమానించే ఫ్యాన్స్‌కు ఎంతో విలువ ఇస్తాడు. తన దగ్గరకు వచ్చిన వారికి ఎంతో ఓపికగా ఆటోగ్రాఫ్‌లు, ఫొటోగ్రాఫ్‌లు ఇస్తుంటాడు. ఒక్కోసారి తన జెర్సీలు కూడా ఇస్తుంటాడు. అందుకే శత్రుదేశమైన పాకిస్థాన్‌లోనూ కింగ్ కోహ్లీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో అభిమానుల విషయంలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు విరాట్ కోహ్లీ. వివరాల్లోకి వెళితే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఆదివారం (అక్టోబర్ 6)న ఈ మ్యాచ్ జరగనుంది. చైన్నైలోని చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌కు అతిథ్యం ఇవ్వనుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరు జట్లు చెన్నై చేరుకున్నాయి. ప్రాక్టీస్ ప్రారంభించాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు టికెట్లు కొనడానికి చెన్నై స్టేడియం దగ్గరకు వచ్చాడు ఓ దివ్యాంగ అభిమాని. అతనికి విరాట్ కోహ్లీ అంటే ఎంతో అభిమానం. అతనిని కలిసి ఒక అద్భుతమైన బహుమతిని ఇవ్వాలనుకున్నాడు. మరి తన కోసం ఎంతో కష్టపడి వీల్ చైర్‌లో వచ్చిన ఆ అభిమానిని కోహ్లీ నిరాశపరుస్తాడా? అందుకే అతనిని చూసిన వెంటనే దగ్గరకు వెళ్లి మరీ పలకరించాడు కోహ్లీ. అభిమాని ఇచ్చిన గిఫ్ట్‌ను తీసుకుని మురిసిపోయాడు. ఆ తర్వాత ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. సరదాగా ఫొటోలు కూడా దిగాడు. దీంతో ఆ దివ్యాంగ అభిమాని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వీటిని చూసిన కోహ్లీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ‘దటీజ్ కింగ్ కోహ్లీ.. ఇందుకే నువ్వంటే మాకు ఇష్టం’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విరాట్‌తో పాటు అక్కడికి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ఆ దివ్యాంగ అభిమానితో సరదాగా ఫొటోలు దిగాడు. మొత్తానికి తన గొప్ప మనసును చాటుకున్నారు విరాట్ కోహ్లీ , శ్రేయస్ అయ్యర్.
Virat Kohli himself went to this special fan, gave him the autographs and asked for pictures.
King Kohli is the definition of kindness! pic.twitter.com/YyIQsNqZqG
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023
Virat Kohli himself visited the special fan and asked if he wants him to sign the frame.
He’s well and truly people’s King!pic.twitter.com/fMNrndaYdq
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023
Shreyas Iyer took a picture with a special fan who came to meet players.
A lovely gesture by Shreyas! pic.twitter.com/CcVEcl2Owg
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023
భారత ప్రపంచ కప్ జట్టు:
రోహిత్ శర్మ (c), శుభ్‌మన్ గిల్,విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..