World Cup 2023: ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) పై పాకిస్థాన్ ఓడిపోవడంపై ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫఖర్ జమాన్ స్పందించాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చాలా పెద్దదని, ఈ ఓటమి జట్టు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందంటూ చెప్పుకొచ్చాడు. అయితే, ఈ ఆటగాళ్లందరూ చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారని, అలాంటి పరాజయాల నుంచి ఎలా కోలుకోవాలో తమకు తెలుసునని ఫఖర్ జమాన్ తెలిపాడు.
భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫకర్ జమాన్ ఆడకపోవడంతో పాక్ జట్టు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఫఖర్ జమాన్ గాయానికి గురయ్యాడు. ఫిట్‌గా మారిన తర్వాత, అతను బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పునరాగమనం చేసి జట్టును విజయపథంలో నడిపించేలా చేశాడు.
మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఫఖర్ జమాన్‌ను భారత జట్టుపై ఓటమిపై ఓ ప్రశ్న అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. కచ్చితంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చాలా పెద్దది. అందులో తేడా రాదని నేను చెబితే అది తప్పే అవుతుంది. కానీ ఆటగాళ్లందరూ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. చాలా క్రికెట్ ఆడారు. భారత్‌పై కూడా చాలా మ్యాచ్‌లు ఆడారు. కాబట్టి ఎలాంటి ఫలితాలొచ్చినా, మరలా గాడిన పడతారు. మా రిథమ్‌ను పరిశీలిస్తే బ్యాటింగ్, బౌలింగ్‌లో పుంజుకున్నాం. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లోనూ మా ప్రదర్శన బాగుంది. కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ ఏకపక్షంగా ఓడించాం’ అంటూ పేర్కొన్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 45.1 ఓవర్లలో 204 పరుగులకే పరిమితమైంది. అనంతరం పాక్ 32.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫఖర్ జమాన్ 74 బంతుల్లో అత్యధికంగా 81 పరుగులు చేశాడు.
బంగ్లాదేశ్ జట్టు: లిట్టన్ దాస్, తాంజిద్ హసన్, మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్(కీపర్), మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరీఫుల్ ఇస్లాం, నసుమ్ అహ్మద్, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, తంజిమ్ హసన్ సాకిబ్.
పాకిస్థాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, హరీస్ రవూఫ్, ఉసామా మీర్, హసన్ అలీ, ఫఖర్ జమాన్, అఘా సల్మాన్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..