వరల్డ్‌కప్‌ నిర్వహణపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు

| Edited By:

Jun 14, 2019 | 8:08 AM

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్షం కారణంగా వరుసపెట్టి మ్యాచులు రద్దు అవుతుండటంతో తీవ్రంగా స్పందించారు.ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయని, భారత్ – పాక్ మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయని ఆయన అన్నారు. అసలు క్రికెట్ టోర్నీలు నిర్వహించకుండా ఇంగ్లాండ్‌ను నిషేధించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడి వేసవి కాస్త క్రమంగా వర్షాకాలంగా మారిపోతుందని అన్నారు. […]

వరల్డ్‌కప్‌ నిర్వహణపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
Follow us on

ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్షం కారణంగా వరుసపెట్టి మ్యాచులు రద్దు అవుతుండటంతో తీవ్రంగా స్పందించారు.ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయని, భారత్ – పాక్ మధ్య ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌పైనా నీలినీడలు కమ్ముకున్నాయని ఆయన అన్నారు. అసలు క్రికెట్ టోర్నీలు నిర్వహించకుండా ఇంగ్లాండ్‌ను నిషేధించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్కడి వేసవి కాస్త క్రమంగా వర్షాకాలంగా మారిపోతుందని అన్నారు. వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించేంత వరకు ఇంగ్లాండ్‌లో టోర్నీలు నిర్వహించకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. లేదంటే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ వర్షం నుంచి కాపాడే కవర్డ్ స్టేడియంలు నిర్మించేంత వరకైనా అక్కడ టోర్నీలు నిర్వహించకుండా చూడాలన్నారు. వర్షాల కారణంగా ప్రపంచకప్ ప్రహసనంగా మారుతోందని విమర్శించారు.