Team India: ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర.. వెస్టిండీస్‌‌పై ఘన విజయం..

|

Feb 15, 2023 | 10:24 PM

మహిళల టి20 ప్రపంచకప్ 2023లో టీమిండియా అమ్మాయిల విజయ పరంపర కొనసాగుతోంది. బుధవారం వెస్టిండీస్‌‌తో జరిగిన మ్యాచ్‌లో గెలవడంతో మహిళల  ఖాతాలో..

Team India: ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర.. వెస్టిండీస్‌‌పై ఘన విజయం..
Team India W beat West Indies W by 6 Wickets
Follow us on

మహిళల టి20 ప్రపంచకప్ 2023లో టీమిండియా విజయ పరంపర కొనసాగుతోంది. బుధవారం వెస్టిండీస్‌‌తో జరిగిన మ్యాచ్‌లో గెలవడంతో మహిళల  ఖాతాలో రెండో విజయం చేరింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం కోసం కాస్త కష్టపడిన భారత్.. వెస్టిండీస్‌పై మాత్రం అలవోకగా నెగ్గింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సౌత్ ఆఫ్రికాలోని కేప్‌టౌన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. 2016 టి20 ప్రపంచకప్ విన్నర్‌గా నిలిచిన వెస్టిండీస్ ముందుగా 118 పరుగులు చేయగా.. 119 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.1 ఓవర్లలోనే 6 వికెట్లు నష్టంతో ఛేదించింది. లేడీ ధోని రిచా ఘోష్ (32 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) మరోసారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ను ఆడింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(42 బంతుల్లో 33; 3 ఫోర్లు) కూడా రాణించింది. విండీస్ బౌలర్లలో రామ్ హరాక్ 2 వికెట్లు తీసుకుంది

అయితే ఛేదనలో టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గాయం నుంచి కోలుకున్నాక ఆడుతున్న స్మృతి మంధాన (10) నిరాశ పరిచింది. రెండో ఫోర్లు కొట్టి మంచి ఊపులో కనిపించిన స్మృతి మంధాన స్టంపౌట్ అయ్యింది. అనంతరం పాకిస్తాన్ పై అర్ధ సెంచరీతో రాణించిన జెమీమా రోడ్రిగ్స్ (1) ఈ మ్యాచ్ లో విఫలం అయ్యింది. ఆ తర్వాత షఫాలీ వర్మ (28) అవుటైంది. దాంతో భారత్ కూడా కష్టాల్లో పడ్డట్లు కనిపించింది. ఈ దశలో జతకలిసిన హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్ లు జట్టును లక్ష్యం వైపు నడిపారు. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 72 పరుగులు జోడించారు. విన్నింగ్ షాట్ కొట్టే ప్రయత్నంలో హర్మన్ ప్రీత్ కౌర్ అవుటైంది. అయితే రిచా ఘోష్ ఫోర్ తో మ్యచ్ ను ఫినిష్ చేసింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు చేసింది. దీప్తి శర్మ 3 వికెట్లతో రాణించింది. విండీస్ ప్లేయర్లలో టేలర్ (40 బంతుల్లో 42; 6 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచింది. క్యాంబెల్ (36 బంతుల్లో 30; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. ఆఖర్లో నేషన్ (21 నాటౌట్) కాసిన్ని పరుగులు సాధించడంతో విండీస్ 100 పరుగుల మార్కును దాటింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..