ICC World Cup: ఆఖరి పోరుకు వేళాయే..! ట్రోఫీ కోసం తలపడనున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా.. పూర్తి వివరాలివే..

|

Feb 26, 2023 | 9:04 AM

ఆస్ట్రేలియా 7వ సారి ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడనుంది. అలాగే 2020లో టీమిండియాను, 2018లో ఇంగ్లండ్‌ను ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియా.. టీ20 ప్రపంచకప్‌ను..

ICC World Cup: ఆఖరి పోరుకు వేళాయే..! ట్రోఫీ కోసం తలపడనున్న ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా.. పూర్తి వివరాలివే..
Ausw Vs Rsaw Women's T20 World Cup 2023 Final Match
Follow us on

ఐసీసీ ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ 2023 ముగింపు దశకు చేరుకుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం ఇవాళ అంటే ఫిబ్రవరి 26న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా.. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన మహిళల జట్టు అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మరోవైపు సౌతాఫ్రికా తొలిసారిగా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టు ఎలాగైనా ట్రోఫీని సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో విజయం ఎవరిదనేది ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇక ఈ ఫైనల్ మ్యాచ్ కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌ వేదికగా ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక అంతకముందు దక్షిణాఫ్రికా జట్టు మొదటిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన సందర్భంగా ఆ టీమ్ ఆభిమానులు అనందంగా ర్యాలీ నిర్వహించారు. అయితే ఆస్ట్రేలియా 7వ సారి ఉమెన్స్ టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆడనుంది. అలాగే 2020లో టీమిండియాను, 2018లో ఇంగ్లండ్‌ను ఫైనల్లో ఓడించిన ఆస్ట్రేలియా.. టీ20 ప్రపంచకప్‌ను వరుసగా 2 సార్లు కైవసం చేసుకుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా కప్‌ను గెలుచుకుని హ్యాట్రిక్ కొట్టాలని దూకుడు ప్రదర్శిస్తోంది ఆస్ట్రేలియా.

ఆస్ట్రేలియా జట్టు: హీథర్ నైట్ (కెప్టెన్), ఆలిస్ కాప్సే, డానీ వాట్, మైయా బౌచిర్, సోఫియా డంక్లీ, చార్లీ డీన్, డేనియల్ గిబ్సన్, నాట్ క్వైర్, అమీ జోన్స్, లోరైన్ విన్‌ఫీల్డ్ హిల్, ఫ్రెయా డేవిస్, ఇస్సీ వాంగ్, కేట్ క్రాస్, కేథరీన్ బ్రంట్, సారా బెల్ గ్లెన్, సోఫీ ఎక్లెస్టన్.

ఇవి కూడా చదవండి

దక్షిణాఫ్రికా జట్టు: సునే లూస్ (కెప్టెన్), అన్నేరి డెర్క్సన్, లారా గూడాల్, లారా వోల్‌వార్ట్, అన్నేకే బోచ్, క్లో ట్రయాన్, డెల్మరీ టక్కర్, మారిజన్ కాప్, నాడిన్ డి క్లెర్క్, సినాలో జాఫ్తా, తజ్మిన్ బ్రిట్స్, అయాబొంగా ఖాకా, మస్బాటా క్లాస్, షమాయిల్, ఎమ్‌మెయిల్ ఇస్లాబాన్‌కోయిమ్.