Team India: ఆ ఇద్దరు లేకుండా ప్రపంచ కప్ గెలవడం అసాధ్యం: కైఫ్ సంచలన వ్యాఖ్యలు

2027 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనుంది. అక్కడి పిచ్‌లు బౌన్సీగా ఉంటాయని, అటువంటి పరిస్థితుల్లో కొత్త కుర్రాళ్లు తడబడే అవకాశం ఉందని కైఫ్ హెచ్చరించారు. రోహిత్, కోహ్లీ వంటి అనుభవజ్ఞులు ఉంటేనే, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోగలరని ఆయన స్పష్టం చేశారు.

Team India: ఆ ఇద్దరు లేకుండా ప్రపంచ కప్ గెలవడం అసాధ్యం: కైఫ్ సంచలన వ్యాఖ్యలు
Team India

Updated on: Dec 07, 2025 | 8:22 PM

ICC ODI World Cup 2027: దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన తర్వాత, మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టీమిండియా భవిష్యత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ప్రాముఖ్యతను గురించి మాట్లాడుతూ, 2027 ప్రపంచ కప్‌లో వీరిద్దరూ లేకుండా భారత్ గెలవడం కష్టమని అభిప్రాయపడ్డాడు.

‘వారిద్దరూ లేకపోతే కష్టమే’..

విశాఖపట్నంలో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం కైఫ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ, “రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకపోతే భారత్ 2027 ప్రపంచ కప్ గెలవలేదు. యువ ఆటగాళ్లు ఎంత ప్రతిభావంతులైనప్పటికీ, ప్రపంచ కప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో ఒత్తిడిని జయించడానికి అనుభవం చాలా అవసరం,” అని పేర్కొన్నారు.

కోహ్లీ రికార్డుల మోత..

ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శనను కైఫ్ ఆకాశానికెత్తారు. “కోహ్లీ ఈ సిరీస్‌లో రెండు వరుస సెంచరీలు చేయడమే కాకుండా, మూడో వన్డేలో 45 బంతుల్లోనే అజేయంగా 65 పరుగులు చేసి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అతను కేవలం 2027 వరకే కాదు, ఆ తర్వాత కూడా ఆడే సత్తా ఉన్న ఆటగాడు. ప్రస్తుతం అతను ఆడుతున్న తీరు చూస్తుంటే, తన రిటైర్మెంట్ గురించి వస్తున్న సందేహాలన్నింటికీ బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నట్లుంది,” అని కైఫ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ కొత్త శైలి..

రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, “రోహిత్ ఇప్పుడు కేవలం మెరుపు ఇన్నింగ్స్‌లకే పరిమితం కావడం లేదు. పరిస్థితిని బట్టి ఆడుతూ, వికెట్ విలువను కాపాడుకుంటున్నాడు. మూడో వన్డేలో అతను చేసిన 75 పరుగులు ఇందుకు నిదర్శనం. కెప్టెన్సీ లేకపోయినా, ఒక సీనియర్ బ్యాటర్‌గా బాధ్యతాయుతంగా ఆడుతూ పెద్ద ఇన్నింగ్స్‌లు నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాడు,” అని కైఫ్ విశ్లేషించారు.

అనుభవం ఎందుకు ముఖ్యం?

2027 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా జరగనుంది. అక్కడి పిచ్‌లు బౌన్సీగా ఉంటాయని, అటువంటి పరిస్థితుల్లో కొత్త కుర్రాళ్లు తడబడే అవకాశం ఉందని కైఫ్ హెచ్చరించారు. రోహిత్, కోహ్లీ వంటి అనుభవజ్ఞులు ఉంటేనే, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోగలరని ఆయన స్పష్టం చేశారు.

మొత్తానికి, సీనియర్ల అవసరం జట్టుకు ఇంకా ఉందని, వారిని పక్కనపెట్టి ప్రపంచ కప్ కలలు కనడం సరికాదని కైఫ్ తేల్చి చెప్పారు.