
ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌నకు ముందుగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ దేశ జాతీయ వన్డే జట్టుకు షకీబుల్ హసన్ మరోసారి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రిటైర్మెంట్ విత్ డ్రా చేసుకుని జట్టులోకి వచ్చిన తమీమ్ ఇక్బాల్ తన కెప్టెన్సీని వదులుకున్నాడు. దీంతో అతడి స్థానంలో సారధ్య బాధ్యతలను షకీబ్ చేపట్టనున్నాడు. బంగ్లాకు మరోసారి కెప్టెన్‌గా షకిబుల్ హసన్ కావడంతో.. భారత అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. షకీబ్ కెప్టెన్ కాగానే.. వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా ప్రపంచ ఛాంపియన్ అయ్యే అవకాశాలు అమాంతం పెరిగాయని ఫ్యాన్స్ అంటున్నారు. దీని వెనుక కారణం లేకపోలేదు. గతంలో షకీబ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడే, టీమ్ ఇండియా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.
2023 వన్డే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ మెగా టోర్నమెంట్ ఇండియాలో జరగనుంది. ఇంతకు ముందు మూడుసార్లు భారత్‌లో ప్రపంచకప్ నిర్వహించగా, మూడుసార్లు పొరుగు దేశం సహకారంతోనే భారత్‌లో ఈ మెగా టోర్నీని జరిగింది. 1987లో పాకిస్థాన్‌తో, 1996లో పాకిస్థాన్, శ్రీలంకతో, 2011లో బంగ్లాదేశ్, శ్రీలంకతో కలిసి భారత్ ప్రపంచకప్‌ను నిర్వహించింది. 2011లో టీమ్ ఇండియా కూడా ఛాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఐసీసీ మెగా టోర్నమెంట్లలో భారత్ పేలవ ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది.
మరోసారి ఈ మెగా ఈవెంట్ భారతదేశానికి తిరిగి వచ్చింది. దీంతో మళ్లీ టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచే గోల్డెన్ ఛాన్స్ ఉందని దేశంలోని ప్రతి అభిమాని భావిస్తునండు. ఆ తర్వాత యాదృచ్ఛికంగా షకీబ్ బంగ్లాదేశ్ కెప్టెన్సీని మరోసారి చేజిక్కించుకోవడం జరిగింది. ప్రపంచకప్‌లోనూ ఆ దేశ వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 2011 ప్రపంచకప్‌లోనూ బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా షకిబుల్ హసనే వ్యవహరించడం ఆసక్తికరం.
అప్పుడు 2011లో, ఇప్పుడు 2023లో భారతదేశం ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్‌లో షకీబ్ తన జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడు. ఆ సమయంలో టీమిండియా ట్రోఫీ సాధించింది. ఇక ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందని టీమిండియా ఫ్యాన్స్ అంటున్నారు. 2011లో టీమిండియాకు ఎలాంటి సీన్స్ రిపీట్ అయ్యాయో.. అదే ఇప్పుడూ జరుగుతున్నాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
Shakib Al Hasan in World Cups:
2007 – Player
2011 – Captain
2015 – Player
2019 – Player
2023 – Captain* pic.twitter.com/jIZ2KHAvEg— Johns. (@CricCrazyJohns) August 11, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం..