Rahul Dravid : రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రావిడ్‌ని నియమిస్తారా..! మాజీ క్రికెటర్ల అభిప్రాయం ఏంటి..?

|

Jul 30, 2021 | 12:13 PM

Rahul Dravid : శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని భవిష్యత్తులో రవిశాస్త్రి స్థానంలో నియమిస్తారని

Rahul Dravid : రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రావిడ్‌ని నియమిస్తారా..! మాజీ క్రికెటర్ల అభిప్రాయం ఏంటి..?
Rahul Dravid
Follow us on

Rahul Dravid : శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ని భవిష్యత్తులో రవిశాస్త్రి స్థానంలో నియమిస్తారని వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం రవిశాస్త్రి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లారు. మరోవైపు రాహుల్ ద్రావిడ్ ఆధ్వర్యంలో భారత జట్టు వన్డే సిరీస్‌ను గెలుచుకుంది కానీ టీ 20 సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. అయితే జట్టు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. ద్రవిడ్ భారత అండర్ -19 జట్టు కోచ్‌గా పనిచేశాడు ఇది కాకుండా అతను యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడానికి అనేక పాత్రలు పోషించాడు.

ఈ ఏడాది చివర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న టి 20 ప్రపంచ కప్ తర్వాత భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగుస్తుంది. అయితే రాహుల్ ద్రవిడ్‌ని కోచింగ్ బాధ్యతలు తీసుకోవాలని రవిశాస్త్రి కోరినట్లు తెలిసింది. అయితే దీనిపై ద్రావిడ్ ఇంకా ఆలోచించడం లేదు. ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో రాహుల్ ద్రావిడ్ ఈ విషయం గురించి ఇలా చెప్పాడు. “నేను కోచ్‌గా క్రికెట్ మజాని అనుభవిస్తున్నాను. కోచ్‌గా పెద్దగా ఆలోచించలేదు. నేను చేస్తున్నదానికి సంతోషంగా ఉంది. ఈ పర్యటనను పూర్తి చేయడం, అనుభవాన్ని ఆస్వాదించడం తప్ప నాకు వేరే ఆలోచన లేదు” అన్నాడు.

ద్రావిడ్ చాలా పాత్రల్లో నటించారు
2018 లో పృథ్వీ షా నాయకత్వంలో ఇండియా 19 జట్టు న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. అప్పుడు జట్టు కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. చాలా సంవత్సరాలుగా యువ క్రికెటర్లు ద్రవిడ్ పనిని, అతని పద్ధతులను ప్రశంసిస్తున్నారు. 2019 లో అతను జాతీయ క్రికెట్ అకాడమీకి ప్రధాన కోచ్‌గా కూడా నియామకం అయ్యాడు.

Six Members dead: గుంటూరు జిల్లాలో మరణాల వెనుక మిస్టరీ ఏంటి..? చిక్కుముడిగా మారిన ప్రశ్నలు..

Mimi Movie Review: మిమి.. భావోద్వేగ మిళితం.. మాతృత్వాన్ని మొక్కుతాం..

Tokyo Olympics 2021 Live Updates: నవనీత్‌కౌర్ గోల్‌తో ఐర్లాండ్‌పై గెలిచి .. రేస్‌లో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు..