భారత్‌లో క్రికెట్ అంటే ఒక మతం.. మన వాళ్లు అత్యధిక ఇష్టపడే ఆట ఏది ఇట్టే చెప్పేస్తారు క్రికెట్ అని. ఎందుకంటే ఇండియాలో క్రికెట్‌ను గొప్పగా చూస్తారు. సూల్క్ వెళ్లే పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ఈ ఆటను ఇష్టపడతారు. అందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)కు ఉన్న ప్రత్యేకత వేరు. 2008లో మొదలైన ఐపీఎల్ ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులకు ఎన్నో అనుభూతులను పంచుతోంది. లీగ్ పట్ల ఉన్న అభిమానం ప్రతి ఆటను గుర్తుండిపోయేలా చేస్తుంది.
సెప్టెంబర్ 24 శుక్రవారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అభిమాని చేసిన పని అందరిని ఆకర్షించింది. అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ ధరించాడు. అతని చేతిలో ఉన్న ప్లకార్డుపై ఒకటి రాసి ఉంది. అదేమిటంటే.. ‘ నా భార్య నా సీఎస్కే జెర్సీ ధరించడానికి అనుమతించలేదని’ రాసి ఉంది.
చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్వీట్టర్‌కు ఈ ఫొటోను పోస్టు చేసింది. ‘Love Is colour Blind’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు ట్విట్టర్లో 17,000 లైకులు వచ్చాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని సేన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఛేధనకు దిగిన చెన్నై 11 బాల్స్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేధించింది.
Love is colour blind ❤️?#RCBvCSK #WhistlePodu #Yellove ? pic.twitter.com/C7oMPEJjfI
— Chennai Super Kings – Mask P?du Whistle P?du! (@ChennaiIPL) September 25, 2021
Read also: AB de Villiers: తండ్రి ఔటవడంతో కుర్చీని తన్నేసిన డివిలియర్స్ కొడుకు.. వైరల్‌గా మారిన వీడియో..
IPL-2021: ఊపుమీద ఉన్న ఢిల్లీ, చెన్నై.. వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్లు..