క్రికెట్‌లో కొత్త సంబురాలు వచ్చేశాయి. ఇప్పుడు తబ్రేజ్ షమ్సీ షూ వేడుకను మర్చిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఉసేన్ బోల్ట్ స్టైల్‌లో బౌలర్ల సెలబ్రేషన్స్ మారిపోతున్నాయి. ఈ క్రమంలో వికెట్ తీసిన తర్వాత డేల్ స్టెయిన్ మేనరిజం కూడా ఈయన ముందు మసకబారిపోయింది. ఎందుకంటే ఈ వేడుకలో తాత స్టైల్ మిక్స్ చేసి ఓ బౌలర్ వేడుకలు చేసుకోవడంతో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ కొత్త వికెట్ టేకింగ్ వేడుకను వెస్టిండీస్ ఆటగాడు అకిల్ హుస్సేన్ పరిచయం చేశాడు. అలాగే మరో విండీస్ బౌలర్ కెవిన్ సింక్లెయిర్ కూడా తనదైన స్టైల్లో పల్టీలు కొడుతూ సంబురాలు చేసుకున్నాడు. దీంతో ఈ స్టైల్‌కు నెటిజన్ల ఫిదా అవుతూ, తెగ కామెంట్లు చేస్తు్న్నారు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ వికెట్ తీసిన తర్వాత రెండు రకాల వేడుకలు జరిగాయి. మొదటి వేడుకలో తాత వాకింగ్ స్టైల్ చూపిస్తే, రెండవది గాలిలో ఎగురుతూ, పల్టీలు కొడుతూ సెలబ్రేట్ చేసుకున్నారు. డెవాన్ కాన్వాయ్ వికెట్ తీసిన తర్వాత అకిల్ హుస్సేన్ ఇలాంటి సంబురాలు చేసుకోవడం వీడియోలో చూడొచ్చు. అలాగే ఈ మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేసిన కెవిన్ సింక్లెయిర్ తొలి వికెట్ సాధించిన సంబరాలు కూడా ఈ వీడియోల చూడొచ్చు.
తాత వాకింగ్ స్టైల్..
న్యూజిలాండ్ టాప్ ఆర్డర్‌ను పెవిలియన్ చేర్చడంలో అకిల్ హొస్సేన్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన అతను 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ 3 వికెట్లలో డెవాన్ కాన్వే వికెట్ పడగొట్టగానే సంబురాలు పీక్స్‌కి చేరాయి. అకిల్ హుస్సేన్ వైడానంలో తాతలా నడుస్తూ వికెట్ టేకింగ్ ఈవెంట్‌ను చేసుకున్నాడు. అతని ఈ వికెట్ వేడుకను చూసిన వారందరూ తెగ నవ్వుకుంటున్నారు. ఈమేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ కూడా గ్రాండ్‌పా ఈజ్ బ్యాక్ అంటూ వీడియోని నెట్టింట్లో షేర్ చేసింది.
మరో బౌలర్ గాల్లో పల్టీలు..
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన కెవిన్ సింక్లెయిర్.. తొలి మ్యాచ్‌లోనే సత్తా చాటాడు. తన మొదటి ODI మ్యాచ్‌లో టామ్ లాథమ్ వికెట్‌ను దక్కించుకున్నాడు. దీంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అతను గాలిలో పల్టీలు కొడుతూ తన ఆనందాన్ని ప్రదర్శించాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ విజయం సాధించి 3 వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో ఆతిథ్య జట్టు మరో 66 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.