Asia Cup 2025 : ఆసియా కప్ టీమ్‎లో లేకపోయినా శ్రేయస్ అయ్యర్ ఎందుకంత సంతోషంగా ఉన్నాడో తెలుసా? కారణం తెలిస్తే షాక్!

శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుత భారత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ముఖ్యమైన టోర్నమెంట్లలో ఆయన తన ప్రతిభను నిరూపించుకున్నారు. కానీ, టెస్ట్, టీ20 ఫార్మాట్‌లలో ఆయనకు జట్టులో స్థానం దక్కడం లేదు. ఆసియా కప్‌కు కూడా ఆయనను ఎంపిక చేయలేదు. ఈ విషయంపై అయ్యర్ తొలిసారి స్పందించారు.

Asia Cup 2025 : ఆసియా కప్ టీమ్‎లో లేకపోయినా శ్రేయస్ అయ్యర్ ఎందుకంత సంతోషంగా ఉన్నాడో తెలుసా? కారణం తెలిస్తే షాక్!
Shreyas Iyer

Updated on: Sep 08, 2025 | 1:58 PM

Asia Cup 2025 : భారత జట్టులోని అద్భుతమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన శ్రేయస్ అయ్యర్, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. టీ20, టెస్ట్ జట్లలో అతనికి చోటు దక్కడం లేదు. తాజాగా ఆసియా కప్ 2025 జట్టు నుంచి కూడా అతన్ని పక్కన పెట్టారు. ఈ విషయంపై అయ్యర్ ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. “టీమ్‌లో ఉండటానికి, ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడటానికి మనం అర్హులమని తెలిసినా, జట్టులో చోటు దక్కకపోతే బాధగా ఉంటుంది. అయితే, అదే సమయంలో టీమ్ కోసం నిలకడగా రాణిస్తున్న వేరే ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లు జట్టు కోసం బాగా ఆడుతున్నప్పుడు మనం వారికి మద్దతు ఇవ్వాలి. చివరికి మన లక్ష్యం టీమ్ ఇండియా గెలవడమే. జట్టు గెలుస్తున్నప్పుడు అందరూ సంతోషంగా ఉంటారు” అని అయ్యర్ పేర్కొన్నాడు.

అయ్యర్​కు ఇండియా-ఎ కెప్టెన్సీ

ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించింది. ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరగనున్న రెండు అనధికారిక టెస్టు మ్యాచ్‌లకు అయ్యర్‌ను ఇండియా-ఎ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమవుతుంది. ఈ జట్టులో సాయి సుదర్శన్, నితీష్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం దక్కింది. వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్​ను వైస్ కెప్టెన్‌గా నియమించారు.

కష్టానికి గుర్తింపు ఎప్పుడూ ఉంటుంది

శ్రేయస్ అయ్యర్ తన వ్యాఖ్యలలో చిత్తశుద్ధి, కష్టపడి పనిచేయడం గురించి కూడా నొక్కి చెప్పారు. “మీకు అవకాశం దక్కకపోయినా, మీరు చిత్తశుద్ధితో మీ పనిని పూర్తి చేయాలి. ఎవరైనా చూస్తున్నప్పుడే మంచిగా ఆడటం కాదు, ఎవరూ చూడనప్పుడు కూడా మీ కష్టాన్ని కొనసాగించాలి. అదే చిత్తశుద్ధి” అని అయ్యర్ తెలిపారు. ఆయన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా అద్భుతంగా రాణించారు. 17 మ్యాచ్‌లలో 604 పరుగులు చేసి, జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లారు. ఈ అద్భుత ప్రదర్శన తర్వాత కూడా అతన్ని ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడంపై పలువురు అభిమానులు,నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే, సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని ఆయన గౌరవించినట్లు స్పష్టమవుతోంది. భారత జట్టులో ప్రస్తుత పోటీ చాలా ఎక్కువగా ఉందని, అందువల్ల ఇలాంటి విషయాలు జరుగుతుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.