IPL RR vs RCB Match Prediction: దుబాయ్ వేదికగా ఉద్దండుల పోరు.. ఇరు జట్లకు కీలకంగా మారనున్న విజయం
ఐపిఎల్ 2021 లో రాజస్థాన్ రాయల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇది రెండో పోరు జరుగనుంది. తొలి మ్యాచ్ విరాట్ కోహ్లీ ఛాలెంజర్ల పేరిట జరిగింది.
Match Prediction of Rajasthan Royals vs Royal Challengers Bangalore: ఐపీఎల్ 2021 లో ఇవాళ రాజస్తాన్ రాయల్స్.. విరాట్ కోహ్లీ ఛాలెంజర్లతో పోటీ పడుతున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ డు ఆర్ డైగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందనేది కీలకంగా మరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 10 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లను కలిగి ఉంది. అదే సమయంలో రాజస్తాన్ రాయల్స్ కూడా 8 మ్యాచ్ ఆడి 8 పాయింట్లను కలిగి ఉంది. అంటే, రెండు జట్లకు విజయంపై ఆశలు సజీవంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ అందించే విజయం ఈ రెండు జట్లలో మరింత విశ్వాన్ని పెంచుతాయి. ఇవాళ్టి గెలుపు ఓటములు రెండు జట్లకు కీలకంగా మారనుంది.
ఐపీఎల్ 2021 లో రాజస్తాన్ రాయల్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఇది రెండో పోరు. ప్రథమార్ధంలో ఇరు జట్లు మొదటిసారి తలపడ్డాయి. ఇందులో విరాట్ కోహ్లీ ఛాలెంజర్స్ పేరిట ఛాలెంజ్ కొనసాగింది. ఇవాళ దుబాయ్‌లో కూడా రెండు జట్లు రెండోసారి తలపడతాయి. ఇరు జట్ల మధ్య చివరి 5 మ్యాచ్‌ల గురించి మనం మొదట చర్చించు కోవాలి. చివరి ఐదు మ్యాచుల్లో కోహ్లీ జట్టు(RCB) నాలుగింటిలో గెలిచి ముందంజలో ఉంది. ఐపీఎల్ పిచ్‌లో రాజస్తాన్-బెంగళూరు 24 సార్లు తలపడ్డాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ 11 సార్లు, రాజస్తాన్ 10 సార్లు గెలిచారు. ఈ రెండు జట్ల మధ్య 3 మ్యాచ్‌లు అసంపూర్తిగా ఉన్నాయి.
గెలుపు ఎవరి వైపు..
ఇరు జట్ల విషయానికొస్తే, బలం సమానంగా కనిపిస్తుంది. కానీ ఇటీవలి ప్రదర్శన ఆధారంగా రాయల్ ఛాలెంజర్స్ పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. ఈ జట్టు బ్యాటింగ్ బౌలింగ్ అన్నీ ప్రస్తుతానికి పూర్తి పటిష్ఠంగా కనిపిస్తున్నాయి. జట్టులో కోహ్లీ పడిక్కల్ ఓపెనింగ్ పార్ట్‌నర్‌షిప్ ఉంటే అప్పుడు మిడిల్ ఆర్డర్‌లో పోరాడుతున్న మాక్స్‌వెల్ వంటి బ్యాట్స్‌మన్ ఉన్నారు.
మరోవైపు, రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ పరిస్థితి కాస్త కఠినంగా ఉంది. జట్టులో బౌలర్లు ఉన్నారు కానీ బ్యాటింగ్ కెప్టెన్ సంజు శాంసన్ ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.
జట్టు సభ్యుల వివరాలు ఇలా..
జట్లు: రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, ఎవిన్ లూయిస్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, ఒషనే థామస్, ముస్తఫిజుర్ రహమాన్, తబ్రేజ్ షమ్సీ, గ్లెన్ ఫిలిప్స్, చేతన్ సకారియా, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, ఆకాశ్ సింగ్, అనూజ్ రావత్, కెసి కరియప్ప, యశస్వి జైస్వాల్, శివమ్ దుబే, శ్రేయస్ గోపాల్, కార్తీక్ త్యాగి, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కట్, కుల్దీప్ యాదవ్, మహిపాల్ లోమ్రర్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), నవదీప్ సైనీ, గ్లెన్ మాక్స్‌వెల్, డాన్ క్రిస్టియన్, రజత్ పటీదార్, దుష్మంత చమీరా, పవన్ దేశ్‌పాండే, మహ్మద్ సిరాజ్, హర్షాల్ పటేల్, మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ బేబీ, వనిందు హసరంగ, జార్జ్ గార్టెన్, యుజ్వేంద్ర చాహల్, షాబాజ్ అహ్మద్, దేవదత్ పాడిక్కల్, కైల్ జమీసన్, సుయాష్ ప్రభుదేశాయ్, కెఎస్ భరత్, టిమ్ డేవిడ్, ఆకాశ్ దీప్, ఎబి డివిలియర్స్
ఇవి కూడా చదవండి: Hand of God: ఆకాశంలో కనిపించిన దేవుడి చేయి.. నాసా విడుదల చేసిన అంతరిక్షంలో అద్భుతం..