Virat Kohli : ‘ఒక్కడివే వచ్చావా అనుష్క ఎక్కడా ?’.. కోహ్లీ క్యూట్ రిప్లైకి ఫిదా అవ్వాల్సిందే
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అనుష్క గురించి అడిగితే విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యూట్ రిప్లై అందరినీ ఆకట్టుకుంది. అలాగే తన టెస్ట్ రిటైర్మెంట్ గురించి కోహ్లీ మొదటిసారిగా మనసు విప్పి మాట్లాడాడు.

Virat Kohli : క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ ఒక ఆదర్శ జంటగా ఉంటారు. తాజాగా, లండన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో కోహ్లీని అనుష్క గురించి అడిగినప్పుడు, అతను ఇచ్చిన క్యూట్ రిప్లై అందరినీ ఆకట్టుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వైరల్ వీడియోలో కోహ్లీని అతని భార్య అనుష్క, పిల్లల గురించి అడిగినప్పుడు తను ఇచ్చిన క్యూట్ సమాధానం అందరినీ ఆకట్టుకుంది. అనుష్క ఇంట్లో పిల్లలను చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుందని కోహ్లీ క్యూట్ సైగలతో చెప్పాడు. ఈ వీడియో లండన్‌లో యువరాజ్ సింగ్ నిర్వహించిన ఒక ఛారిటీ ఈవెంట్‌కు సంబంధించినది. ఈ కార్యక్రమానికి కోహ్లీతో పాటు అనేకమంది క్రికెట్ దిగ్గజాలు హాజరయ్యారు.
ఈ వీడియో లండన్‌లో యువరాజ్ సింగ్ నిర్వహించిన ఒక ఛారిటీ ఈవెంట్‌కు సంబంధించినది. కోహ్లీ తన స్నేహితుడు కెవిన్ పీటర్సన్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ప్రేక్షకుల వైపు సైగలు చేస్తూ కనిపించాడు. అప్పుడు ఎవరో అనుష్క, పిల్లల గురించి అడగ్గా కోహ్లీ చేతి సైగలతో ఆమె ఇంట్లో పిల్లలను చూసుకుంటూ విశ్రాంతి తీసుకుంటుందని చెప్పాడు.
కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ గురించి మొదటిసారిగా ఈ కార్యక్రమంలో మాట్లాడాడు. భారత జట్టు ఆటగాళ్లు కూడా ఈ ఈవెంట్‌లో ఉన్నారు. “నేను రెండు రోజుల క్రితమే గడ్డానికి రంగు వేసుకున్నాను. ప్రతి నాలుగు రోజులకోసారి గడ్డానికి రంగు వేసుకునే సమయం వచ్చింది, ఇక రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది” అని సరదాగా చెప్పాడు.
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోహ్లీ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కోహ్లీ కూడా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ పబ్లిక్ ఈవెంట్‌కు ముందు తను వింబుల్డన్‌కు కూడా వెళ్ళాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




