AUS vs WI: వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు ప్రస్తుతం ఐదు టీ20ల సిరీస్‌లో తలపడుతున్నాయి. ఇందులో భాగంగా వెస్టిండీస్ టీం వరుసగా మూడు మ్యాచుల్లో విజయం సాధించి ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. తాజాగా వెస్టిండీస్ బౌలర్ ఫాబియన్ అలెన్ సూపర్ల క్యాచ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం సూపర్ క్యాచ్‌ల వీడియోలు నెట్టింట్లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. భారత మహిళలు, ఇంగ్లండ్ మహిళలతో జరిగిన రెండో టీ20లోనూ హర్లీన్ డియోల్ కూడా అద్భుతంగా బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న వీడియో నెట్టింట్లో ఎంతగా వైరల్ అయిందో చూశాం. తాజాగా వెస్టిండీస్ ఆటగాడు ఫాబియన్ అలెన్ క్యాచ్ కూడా అదే రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. అసలు విషయానికి వస్తే.. ఫాబియన్ అలెన్ బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ రాణించాడు. అంతకు ముందు ఓవర్లో ఆసీస్ ఆటగాడు మిచెల్ మార్ష్ వికెట్ తీసి, దెబ్బ తీశాడు. ఆ తరువాత మరో రెండు క్యాచులతో అలరించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో హెడెన్ వాల్స్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ ఓవర్లో ఐదో బంతిని కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆడాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఇంతలో లాంగాన్‌లో ఉన్న బ్రావో, అలెన్‌లు క్యాచ్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చారు. ముందుగా బ్రావో బాల్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కానీ, అతని చేతుల నుంచి బాల్ జారిపోయింది. పక్కనే ఉన్న ఫాబియన్ అలెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో షాకైన ఫించ్ నిరాశగా పెవిలియన్ చేరడంతో.. వెస్టిండీస్ క్రికెటర్లు సంబరాలు చేసుకున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. క్రిస్ గేల్ సునామీలా బ్యాటింగ్ చేయడంతో వెస్టిండీస్ టీం ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు సాధించింది. హెన్రిక్స్ 33, ఆరోన్ ఫించ్ 30 పరుగులతో రాణించారు. వెస్టిండీస్ బౌలర్లలో కాట్రెల్ 3, ఆండీ రసెల్ 2 వికెట్లు పడగొట్టారు. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్.. కేవలం 14.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. క్రిస్ గేల్ 38 బంతుల్లో 67 పరుగలు (4 ఫోర్లు, 7 సిక్సర్లు) చేయగా, కెప్టెన్ నికోలస్ పూరన్ 32 పరుగులతో రాణించారు. ఇదే మ్యాచ్‌లో క్రిస్ గేల్ ఓ అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో 14,000 వేల పరుగులు అందుకున్న మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
Also Read:
టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు.. అదరగొట్టే డబుల్ సెంచరీతో విజయాన్ని అందించాడు.. అతడెవరంటే.!