Delhi Capitals: కొత్త జోష్‌.. కొత్త జెర్సీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ కొత్త జెర్సీ ఎలా ఉందో చూశారా.?

|

Mar 12, 2022 | 1:07 PM

Delhi Capitals: ఐపీఎల్‌ (IPL 2022) మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. గడిచిన రెండు సీజన్‌లపై కరోనా (Corona) ప్రభావం పడింది. దీంతో ఐపీఎల్‌ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించారు. అంతేకాకుండా స్టేడియంలోకి ప్రేక్షకులకు..

Delhi Capitals: కొత్త జోష్‌.. కొత్త జెర్సీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ కొత్త జెర్సీ ఎలా ఉందో చూశారా.?
Delhi Capitals
Follow us on

Delhi Capitals: ఐపీఎల్‌ (IPL 2022) మ్యాచ్‌ల కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. గడిచిన రెండు సీజన్‌లపై కరోనా (Corona) ప్రభావం పడింది. దీంతో ఐపీఎల్‌ మ్యాచ్‌లను విదేశాల్లో నిర్వహించారు. అంతేకాకుండా స్టేడియంలోకి ప్రేక్షకులకు కూడా అనుమతి ఇవ్వలేరు. అయితే తాజాగా కరోనా ప్రభావం దాదాపు దూరంకావడంతో 2022 ఐపీఎల్‌ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగనుందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఈ సారి ఐపీఎల్‌లో కొత్తగా గుజరాత్‌, లక్నో రెండు ఫ్రాంచైజీలు బరిలోకి దిగడంతో టోర్నీపై మరింత ఆసక్తి పెరిగింది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం క్రికెటర్‌ లవర్స్‌ ఎదురు చూస్తున్నారు.

ఇక ఇప్పటికే ఐపీఎల్‌ వేలంపాటలో ప్లేయర్స్‌ను కొనుగోలు చేసుకున్న టీమ్‌లు విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. కప్‌ కొట్టాలనే కసితో అన్ని జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ మరింత జోష్‌తో రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈసారి టోర్నీలో కొత్త జెర్సీలో ఆడనుంది. ఈ మేరకు ఢిల్లీ యాజమాన్యం తమ కొత్త జెర్సీని ట్విట్టర్‌ వేదికగా విడుదల చేసింది. ‘నయూ ఢిల్లీకి నయూ జెర్సీ’ అనే పేరుతో ఈ వీడియోను పోస్ట్‌ చేశారు. ఇక బ్లూ, రెడ్‌ కలర్‌తో కూడిన జెర్సీ ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా జెర్సీలో మధ్యలో గాండ్రిస్తున్నట్లున్న టైగర్‌ ఆకట్టుకుంటోంది. మరి కొత్త జెర్సీతో బరిలోకి అడుగు పెడుతున్న ఢిల్లీ ఈసారి ఎలాంటి మ్యాజిక్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

ఢిల్లీ జట్టు సభ్యులు వీరే..

రిషంబ్‌ పంత్‌ (కెప్టెన్), అక్షర్‌ పటేల్‌, పృథ్వీ షా, నోర్జే, డేవిడ్‌ వార్నర్, మిచెల్‌ మార్చ్‌, షార్దుల్‌ థాకూర్‌, ముస్తాఫిజుర్ రెహమాన్, కుల్దీప్‌ యాదవ్‌, అశ్విన్‌ హిబ్బర్‌, అభిషేక్‌ శర్మ, కమలేష్‌ నాగర్‌ కోటి, కేఎస్‌ భరత్‌, మన్‌దీప్‌ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియా, లలిత్‌ యాదవ్‌, రిపల్‌ పటేల్‌, యష్‌ ధుల్‌, పావెల్‌, ప్రావిన్‌ దుబే, లుంగిడి, విక్కీ ఓస్ట్‌వల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌.

Also Read: Andhra Pradesh: వంట నూనె విషయంలో ఇలా మోసం చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త

Anatapuram: కాటమరాయుడి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ.. రేపు లక్ష్మీనరసింహుని కళ్యాణం.. భారీగా ఏర్పాట్లు

Samantha Ruth Prabhu: ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ సాంగ్ గురించి సామ్ ఏమన్నాదంటే..