World Cup 2023: ఏడాదిగా జట్టుకు దూరం.. కట్‌చేస్తే.. వన్డే ప్రపంచకప్‌ స్వ్కాడ్‌లో సడన్ ఎంట్రీ.. జాఫర్ జట్టులో ఎవరున్నారంటే?

ODI World Cup 2023: టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ప్రపంచ కప్ 2023 కోసం తన 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేశాడు. ఈ జట్టులో కొంతకాలంగా జట్టులో లేని ఆటగాడికి కూడా చోటు కల్పించాడు.

World Cup 2023: ఏడాదిగా జట్టుకు దూరం.. కట్‌చేస్తే.. వన్డే ప్రపంచకప్‌ స్వ్కాడ్‌లో సడన్ ఎంట్రీ.. జాఫర్ జట్టులో ఎవరున్నారంటే?
Team India

Updated on: Jul 25, 2023 | 4:22 PM

Wasim Jaffer ODI World Cup Team: జియో సినిమాపై చర్చ సందర్భంగా, వసీం జాఫర్ ODI ప్రపంచ కప్ 2023 కోసం టీమ్ ఇండియాను ఎంపిక చేశాడు. వసీం జాఫర్ తన జట్టులో ముగ్గురు ఓపెనర్లను ఎంచుకున్నాడు. ఇందులో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. జాఫర్ మాట్లాడుతూ, ‘నా టీంలో ముగ్గురు ఓపెనర్లు ఉంటారు. శిఖర్ ధావన్‌ని ఎంపిక చేయనప్పటికీ, అతనిని నా జట్టులో బ్యాకప్ ఓపెనర్‌గా ఉంచుతాను. మిడిల్ ఆర్డర్, స్పిన్నర్ గురించి మాట్లాడితే.. ‘విరాట్ కోహ్లీ మూడో నంబర్‌లో ఆడతాడనడంలో సందేహం లేదు. శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో, హార్దిక్ పాండ్యా 6వ స్థానంలో ఆడనున్నారు. దీని తర్వాత నా లిస్టులో ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఉంటారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ ఆటగాళ్లకు తమ జట్టులో చోటు..

వసీం జాఫర్ మాట్లాడుతూ, ‘నా ప్లేయింగ్ 11లో జస్ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్‌లలో ఒకరు ఉంటారు. ప్రపంచకప్ భారత్‌లో ఉన్నందున హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయడం నాకు చాలా ముఖ్యం. అతను 10 ఓవర్లు వేయకపోయినా, ఏడు-ఎనిమిది ఓవర్లు వేసినా నాకు సరిపోతుంది. అతను బౌలింగ్ చేస్తే, ముగ్గురు స్పిన్నర్లను ఆడగలం. బ్యాకప్‌గా శార్దూల్ ఠాకూర్‌ను బౌలర్‌గా, సంజూ శాంసన్‌ను వికెట్ కీపర్‌గా’ ఎంచుకున్నాడు.

ప్రపంచ కప్ 2023 కోసం వసీం జాఫర్ ఎంపిక చేసిన భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, సంజూ శాంసన్.

ఇవి కూడా చదవండి

టీమ్ ఇండియా మ్యాచ్‌ల షెడ్యూల్..

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, అక్టోబర్ 8, చెన్నై

భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, అక్టోబర్ 11, ఢిల్లీ

భారత్ వర్సెస్ పాకిస్థాన్, అక్టోబర్ 15, అహ్మదాబాద్

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, అక్టోబర్ 19, పుణె

భారత్ వర్సెస్ న్యూజిలాండ్, అక్టోబర్ 22, ధర్మశాల

భారత్ వర్సెస్ ఇంగ్లండ్, అక్టోబర్ 29, లక్నో

భారత్ వర్సెస్ క్వాలిఫయర్, నవంబర్ 2, ముంబై

ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా, నవంబర్ 1, కోల్‌కతా

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..