AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wasim Akram : ఛీ..ఛీ.. వాడితో నాకు పోలికేంటి.. బుమ్రా గురించి వసీం అక్రం షాకింగ్ కామెంట్స్!

వసీం అక్రమ్ తన కెరీర్‌లో 104 టెస్ట్ మ్యాచ్‌లలో 414 వికెట్లు, 356 వన్డే మ్యాచ్‌లలో 502 వికెట్లు తీశాడు. మరోవైపు, బుమ్రా ఇప్పటివరకు 48 టెస్ట్ మ్యాచ్‌లలో 19.82 అద్భుతమైన సగటుతో 219 వికెట్లు తీశాడు. అదనంగా, అతను 149 వన్డే, 82 టీ20ఐ వికెట్లు కూడా తీసుకున్నాడు.

Wasim Akram : ఛీ..ఛీ.. వాడితో నాకు పోలికేంటి..  బుమ్రా గురించి వసీం అక్రం షాకింగ్ కామెంట్స్!
Wasim Akram
Rakesh
|

Updated on: Sep 03, 2025 | 9:30 AM

Share

Wasim Akram : భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోని బెస్ట్ బౌలర్లలో ఒకడు. తన అద్భుతమైన బౌలింగ్ కారణంగా చాలామంది అతనిని పాకిస్తాన్ దిగ్గజ పేసర్ వసీం అక్రంతో పోలుస్తారు. సోషల్ మీడియా, క్రికెట్ ప్యానెల్స్‌లో బుమ్రా, వసీం అక్రంలలో ఎవరు గొప్ప బౌలర్ అనే చర్చ నిరంతరం జరుగుతుంది. ఇప్పుడు ఈ పోలికపై స్వయంగా వసీం అక్రం స్పందించాడు.

బుమ్రాతో పోలికపై అక్రం వ్యాఖ్యలు..

జియో టీవీ షో హార్నా మనా హైలో వసీం అక్రం మాట్లాడుతూ.. “జస్ప్రీత్ బుమ్రా ఒక అద్భుతమైన బౌలర్. అతడి బౌలింగ్ యాక్షన్ చాలా డిఫరెంటుగా ఉంటుంది. తన స్పీడు కూడా అద్భుతం. అతని వర్క్‌లోడ్‌ను బీసీసీఐ మేనేజ్ చేసిన విధానం చాలా ప్రశంసనీయం. కానీ, 90వ దశకంలోని క్రికెట్‌ను ఇప్పుడున్న క్రికెట్‌తో పోల్చలేము. నేను లెఫ్ట్ హ్యాండ్ బౌలర్‌ను, అతను రైట్ హ్యాండ్ బౌలర్. ఇది కేవలం సోషల్ మీడియా చర్చ మాత్రమే, దాని గురించి మనం పట్టించుకోకూడదు. అతడి కాలంలో అతడు పేరు సంపాదించుకున్నాడు. నేను నా కాలంలో ఆడాను. అతడు ఇప్పటిక క్రికెట్‌కు ఒక గొప్ప బౌలర్.” అని వ్యాఖ్యానించాడు.

ఆటగాళ్ల మధ్య పోలిక.. గణాంకాలు ఏం చెబుతున్నాయి?

వసీం అక్రం తన కెరీర్‌లో 104 టెస్టుల్లో 414 వికెట్లు, 356 వన్డేల్లో 502 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు, బుమ్రా ఇప్పటివరకు 48 టెస్టుల్లో 219 వికెట్లు తీశాడు. అతని యావరేజ్ 19.82గా ఉంది. దీనికి తోడు అతను వన్డేలలో 149, టీ20లలో 82 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలను బట్టి చూస్తే, బుమ్రా వేగంగా గొప్ప బౌలర్ల జాబితాలో స్థానం సంపాదిస్తున్నాడు.

బుమ్రాను మెచ్చుకున్న వరుణ్ ఆరోన్

భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ కూడా ఈ చర్చలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. “బుమ్రాను ఒక జీనియస్ బౌలర్ అని చెప్పడం కూడా తక్కువ అవుతుంది. అతను సేనా(SENA)(దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో వసీం అక్రం కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఇది అతని కెపాసిటీని నిరూపిస్తుంది. వసీం అక్రం తన కాలంలో గొప్ప పేసర్. బుమ్రా కూడా అక్రం కంటే ముందు కాకపోయినా, కనీసం అతని స్థాయిలో ఉన్న బౌలర్” అని పేర్కొన్నాడు.

ఆసియా కప్‌లో బుమ్రా సత్తా

జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఆసియా కప్ 2025లో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. అతని ఫిట్‌నెస్, వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేయడానికి చాలా కాలం పాటు అతనికి టీ20 క్రికెట్ నుంచి విశ్రాంతిని ఇచ్చారు. ఇప్పుడు యూఏఈలో జరిగే టోర్నమెంట్‌లో అతను టీమిండియా పేస్ అటాక్‌కు నాయకత్వం వహిస్తాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..