Gambhir: వరుస టెస్టు ఓటములు.. హెడ్ కోచ్‌గా గంభీర్ అవుట్.! నెక్స్ట్ సిరీస్‌లో..

|

Oct 28, 2024 | 1:08 PM

టీమిండియా తదుపరి సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంది. నవంబర్ 8 నుంచి 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో టీమిండియా ప్రధాన కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనుండడం విశేషం. మరి గంభీర్ పరిస్థితి ఏంటి.?

Gambhir: వరుస టెస్టు ఓటములు.. హెడ్ కోచ్‌గా గంభీర్ అవుట్.! నెక్స్ట్ సిరీస్‌లో..
Gautam Gambhir
Follow us on

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ తర్వాత, టీమిండియా తన తదుపరి సిరీస్‌ను దక్షిణాఫ్రికాతో ఆడాల్సి ఉంది. నవంబర్ 8 నుంచి సఫారీలతో 4 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు ముందే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. గంభీర్‌కు బదులుగా ఈ సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్‌ బాధ్యతలు చేపట్టనున్నాడు. అసలు ఎందుకీ ఈ చేంజ్.? రీజన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇది చదవండి: ఓర్నీ.! దోచేయ్ మూవీ చిన్నది దుమ్మురేపిందిగా.. పోజులు చూస్తే మెంటలెక్కాల్సిందే

డిసెంబర్‌లో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉండటంతో.. గౌతమ్ గంభీర్‌కు ఆ బాధ్యతలు అప్పగించి.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు లక్ష్మణ్‌కు హెడ్ కోచ్ బాధ్యతలు అప్పగించనుందట. బోర్డర్-గవాస్కర్ సిరీస్ కోసం భారత టెస్టు జట్టు.. ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. నవంబర్ 10న ఆ జట్టు ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. ఇదిలా ఉండగా.. వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా.. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఉన్న టీమిండియా జట్టు నవంబర్ 8, 10, 13, 15 తేదీల్లో దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. డర్బన్, జికెబెర్హా, సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి. అటు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు యువ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఈ జట్టు కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కాగా.. జట్టులో మొత్తం యువ ఆటగాళ్లే ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అజీర్తి, కడుపు ఉబ్బరంతో ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. అమ్మబాబోయ్! ఎక్స్‌రే చూడగా

భారత టీ20 జట్టు:

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రమణదీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, విజయ్‌కుమార్ విశాక్, అవేష్ ఖాన్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ మరియు యష్ దయాల్.

గౌతమ్ గంభీర్‌కి క్లిష్ట రోజులు..

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు గడ్డు కాలం ముందున్నదని తెలుస్తోంది. అసలే టీం ఇండియా సొంతగడ్డపై టీ20 సిరీస్‌ను కోల్పోయింది. అలాగే 3 టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్ మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకుంది. ఇక ఇప్పుడు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ టెస్ట్ సిరీస్‌ను గెలవాలి. లేదంటే భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు చేరడం కష్టమే.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..