Happy Birthday VVS Laxman: భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణతో వీవీఎస్ లక్ష్మణ్‌కు బంధుత్వం.. అదెలాగో మీకు తెలుసా?

|

Nov 01, 2022 | 4:34 PM

వంగీపురపు వెంకట సాయి లక్ష్మణ్.. ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు.. మరి వీవీఎస్ లక్ష్మణ్ పేరు చెబితే యావత్ దేశ క్రికెట్ అభిమానులు టకీమని గుర్తుపట్టేస్తారు...

Happy Birthday VVS Laxman: భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణతో వీవీఎస్ లక్ష్మణ్‌కు బంధుత్వం.. అదెలాగో మీకు తెలుసా?
Vvs Laxman And Dr Sarvepalli Radhakrishnan
Follow us on

వంగీపురపు వెంకట సాయి లక్ష్మణ్.. ఈ పేరు చాలా తక్కువ మందికి తెలుసు.. మరి వీవీఎస్ లక్ష్మణ్ పేరు చెబితే యావత్ దేశ క్రికెట్ అభిమానులు టకీమని గుర్తుపట్టేస్తారు భారత మాజీ క్రికెటర్ అని. అవును, ఇండియన్ క్రికెట్ హిస్టరీలో లక్ష్మణ్ క్రియేట్ చేసిన రికార్డ్స్ అన్నీ ఇన్నీ కావు. వీవీఎస్ లక్ష్మణ్ భారతదేశం తరఫున ఆడిన అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరు. 15 ఏళ్ల కెరీర్‌లో లక్ష్మణ్ 134 టెస్టుల్లో 45.97 సగటుతో 8,781 పరుగులు చేశారు. ఇందులో 17 సెంచరీలు, 56 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వీటిలో చాలావరకు టీమ్ ఇండియాకు అద్భుత విజయాన్ని అందించాయి.

వీవీఎస్ లక్ష్మణ్.. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సేహ్వాగ్, రాహుల్ ద్రావిడ్‌లకు పూర్తి భిన్నం. ఎలాంటి బౌలింగ్‌ను అయినా ఎదుర్కోగలిగే అద్భుత సామర్థ్యం ఆయన సొంతం. అందుకే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఆయనకంటూ ప్రత్యేక పేజీ ఉంది. ఇవాళ వీవీఎస్ లక్షణ్ 48వ పుట్టిన రోజు. యావత్ దేశ క్రికెట్ అభిమానులతో పాటు, ప్రపంచ దేశాల్లోని అభిమానులు, క్రికెటర్లు, ప్రముఖులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వీవీఎస్ లక్ష్మణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి వరకు ఆయన గురించి తెలియని కొన్ని ఆసక్తికర విషయాలను ఇవాళ మనం తెలుసుకుందాం..

సర్వేపల్లి రాధాకృష్ణ ముని మనవడు..

భారతదేశానికి రెండవ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణ ముని మనవడు ఈ వీవీఎస్ లక్ష్మణ్. లక్ష్మణ్ హైదరాబాద్‌లో జన్మించాడు. లక్ష్మణ్ తల్లిదండ్రులు విజయవాడకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ శాంతారామ్, డాక్టర్ సత్యభామ. లక్ష్మణ్ హైదరాబాద్‌లోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో చదివాడు. మెడికల్ కోర్సులో చేరి.. చివరకు బ్యాట్ చేతపట్టి క్రికెటర్ అయ్యాడు. గుంటూరుకు చెందిన జీఆర్ శైలజను 2004లో వివాహం చేసుకున్నాడు లక్ష్మణ్. వీరికి కుమారుడు సర్వజిత్, కుమార్తె అచింత్య ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈడెన్ గార్డెన్స్‌లో దుమ్మురేపిన వైనం..

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై లక్ష్మణ్ చేసిన 281 పరుగులను టెస్ట్ క్రికెట్ చరిత్రలో అద్భుతంగా పేర్కొంటారు. లక్ష్మణ్.. ద్రవిడ్‌తో కలిసి 376 పరుగుల ఘన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ స్కోర్ 2001లో భారత్‌కు టెస్టు సిరీస్‌ను సమం చేయడంలో సహాయపడింది.

వన్డేల్లోనూ సత్తా చాటిన లక్ష్మణ్..

లక్ష్మణ్ టెస్ట్‌లలో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కు మూలస్తంభం. అతని కెరీర్ ప్రారంభంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపుపొందాడు. అయితే, లక్ష్మణ్ వన్డేలలోనూ అద్భుతంగా రాణించాడు. లక్ష్మణ్ ఆడిన దాదాపు వండే మ్యాచ్‌లలో తన సత్తా ఏంటో చూపించాడు. 86 వన్డేలు ఆడిన లక్ష్మణ్ 30.76 సగటుతో 2,338 పరుగులు చేశాడు.

ఆసీస్‌కు చుక్కలే..

క్రికెట్‌ హిస్టరీలో ఆసిస్ చరిత్ర వేరు. చాలా డేంజర్ అనే ఒక ముద్ర ఉండేది. అలాంటి ఆస్ట్రేలియాకు సైతం చుక్కలు చూపించేవాడు లక్ష్మణ్. లక్ష్మణ్ చేసిన 17 టెస్ట్ సెంచరీల్లో 6 ఆస్ట్రేలియాపై చేసినవే కావడం విశేషం.

వెరీ వెరీ స్పెషల్..

లక్ష్మణ్.. ఆఫ్-స్టంప్ వెలుపల మిడ్-వికెట్ ద్వారా డెలివరీని బాగా ఆడగల అరుదైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. అతని అప్రయత్న స్ట్రోక్‌ప్లే, మణికట్టు ఫ్లెక్సిబిలిటీ కారణంగా లక్ష్మణ్‌ను ‘‘వెరీ వెరీ స్పెషల్’’ క్రికెటర్‌గా పరిగణిస్తారు నిపుణులు.

ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం..

క్రికెట్‌కు అందించిన అద్భుతమైన కృషికి గానూ లక్ష్మణ్‌కు 2011లో భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. 2001 సంవత్సరానికి అర్జున అవార్డును కూడా అందుకున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..