Video: కోహ్లీకే దమ్కీ ఇచ్చిన జూనియర్ సెహ్వాగ్.. రాంగ్ ఆన్సర్‌తో బుక్కైన రన్ మెషీన్.. వైరల్ వీడియో

Virat Kohli: ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో, ఆర్యవీర్ తన క్రికెట్ రోల్ మోడల్ పేరు చెప్పమని కోహ్లీని కోరాడు. అతను మొదట సచిన్ టెండూల్కర్ పేరును తీసుకున్నాడు. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లను కూడా కోహ్లీ ప్రస్తావించాడు. అయితే, సచిన్ వల్లే నేను క్రికెట్ చూడటం, ఆడటం మొదలెట్టానని చెప్పుకొచ్చాడు.

Video: కోహ్లీకే దమ్కీ ఇచ్చిన జూనియర్ సెహ్వాగ్.. రాంగ్ ఆన్సర్‌తో బుక్కైన రన్ మెషీన్.. వైరల్ వీడియో
Virat Kohli Viral Video

Updated on: Mar 05, 2024 | 3:59 PM

Virat kohli: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, విరాట్ కోహ్లీ ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. లండన్‌లో తన కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతున్నాడు. ఇంతలో, కోహ్లి పాత ఇంటర్వ్యూకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ ఇంటర్వ్యూని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడికి ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో, కోహ్లీ తన అరంగేట్రం మ్యాచ్ స్కోరు తప్పు అని కూడా ప్రకటించడం గమనార్హం.

నిజానికి, ఆర్యవీర్ సెహ్వాగ్ విరాట్ కోహ్లీని ఓ ప్రశ్న అడిగాడు. మీరు అరంగేట్రం మ్యాచ్‌లో ఎన్ని పరుగులు చేశారు? దీనికి కోహ్లీ స్పందిస్తూ, నేను 8 పరుగులు చేసి ఉండవచ్చు అంటూ సమాధానం తెలిపాడు. నా కెరీర్‌లో నేను మొదటిసారి ఓపెనింగ్ చేస్తున్నాను. మీ తండ్రి (వీరేంద్ర సెహ్వాగ్) స్థానంలో నాకు ఓపెనింగ్ అవకాశం వచ్చింది. ఆ మ్యాచ్‌కి ముందు మీ నాన్న గాయపడ్డారు. తర్వాత నన్ను ఓపెనింగ్ చేయమని అడిగారు అంటూ తెలిపాడు.

అయితే, కోహ్లి చెప్పిన స్కోరు తప్పని తేలింది. అరంగేట్రం మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 12 పరుగులు చేశాడు. అనుభవజ్ఞుడైన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 2008లో శ్రీలంకపై అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. గాయం కారణంగా సెహ్వాగ్ ఆ మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. అరంగేట్రం మ్యాచ్‌లో కోహ్లికి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం లభించింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ వీడియోను ఇక్కడ చూడండి:

విరాట్ కోహ్లీ రోల్ మోడల్‌ ఎవరంటే..

ఈ ఇంటర్వ్యూ ప్రారంభంలో, ఆర్యవీర్ తన క్రికెట్ రోల్ మోడల్ పేరు చెప్పమని కోహ్లీని కోరాడు. అతను మొదట సచిన్ టెండూల్కర్ పేరును తీసుకున్నాడు. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లను కూడా కోహ్లీ ప్రస్తావించాడు. అయితే, సచిన్ వల్లే నేను క్రికెట్ చూడటం, ఆడటం మొదలెట్టానని చెప్పుకొచ్చాడు.

ఇంటర్య్వూ సారాంశం ఇప్పుడు చూద్దాం..

ప్రశ్న: పాఠశాల రోజులలో మీకు గుర్తుండిపోయే మ్యాచ్ ఏదైనా ఉందా?

జవాబు: గతంలో రాజేష్ పీటర్ టోర్నమెంట్ ఢిల్లీలో జరిగేది. అందులో నేను తొలిసారి అకాడమీ తరపున ఆడుతున్నాను. ఆ టోర్నీలోని ఒక ప్రధాన మ్యాచ్‌లో నేను అజేయంగా 90 పరుగులు చేశాను. ఆ సమయంలో నేను 4వ నంబర్‌లో బ్యాటింగ్‌ చేసేవాడిని. ఆ మ్యాచ్‌లో, మాకు 1-2 వికెట్లు మిగిలి ఉన్నాయి. గెలవడానికి కొన్ని పరుగులు అవసరం. కాబట్టి నేను వాటిని స్కోర్ చేశాను.

ప్రశ్న: ఇంతకుముందు మీకు నచ్చని ఆహారం ఏమిటి, ఇప్పుడు మీరు ఏమి తినాలనుకుంటున్నారు?

జవాబు: మొదట్లో పొట్లకాయ తప్ప అన్నీ ఇష్టమే. తర్వాత బరువు తగ్గాల్సి వచ్చింది. కాబట్టి అన్నీ వదిలేశాను. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళినప్పుడు, నాకు ఇష్టమైన రాజ్మా-రైస్ తింటాను.

ప్రశ్న: మీరు చదువుకునే రోజుల్లో ఏ క్రీడలను ఇష్టపడేవారు?

జవాబు: స్కూల్‌లో క్రికెట్‌తో పాటు బాస్కెట్‌బాల్ కూడా ఎక్కువగా ఆడేవాడిని. అలాగే, ఫుట్‌బాల్‌, బ్యాడ్మింటన్, వాలీబాల్ కూడా ఆడాను.

ప్రశ్న: మీరు క్రికెటర్ కాకపోతే ఏ క్రీడలో ఆడి ఉండేవారు?

సమాధానం: నేను క్రికెటర్‌ని కాకపోతే ఫుట్‌బాల్‌లోకి వెళ్లి ఉండేవాడిని లేదా బ్యాడ్మింటన్ ఆడేవాడిని. ఈ రెండు క్రీడలంటే నాకు చాలా ఇష్టం.

ప్రశ్న: బాల్యంలో మీ ఆరాధ్యదైవం ఎవరు?

సమాధానం: చిన్నప్పటి నుంచి నా రోల్ మోడల్ సచిన్ టెండూల్కర్. ఇది కాకుండా, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ నుంచి నేను చాలా ప్రేరణ పొందాను. సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చూసిన తర్వాత క్రికెట్ ఆడాలని అనుకున్నాను.

ప్రశ్న: మీ తొలి మ్యాచ్‌లో మీ స్కోరు ఎంత?

సమాధానం: నేను బహుశా ఆ మ్యాచ్‌లో 8 పరుగులు చేశాను. నేను నా జీవితంలో మొదటిసారి ఓపెనింగ్ చేశాను. మీ నాన్న (వీరేంద్ర సెహ్వాగ్) మ్యాచ్‌కు ఒక రోజు ముందు గాయపడ్డాడు, కాబట్టి నన్ను ఓపెనింగ్ చేయమని అడిగారు. నేను ఆడాలనుకుంటున్నాను అని చెప్పాను.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..