Team India: పంత్, స్కైలకు దెబ్బేశాడుగా.. దూసుకొస్తున్న ధోని 1000 వాలా.. టీ20 ప్రపంచకప్‌ బెర్త్ ఖరారు..

Rishabh Pant- Suryakumar Yadav: ఐపీఎల్ 2024 ఫైనల్ మే 26న జరుగుతుంది. ఆపై ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును కూడా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ జాబితాలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజ ఆటగాళ్ల పేర్లు కూడా ప్రాబబుల్స్‌గా ఉన్నాయి. అయితే దీనికి ముందు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మాజీ తుఫాన్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ టీమ్ ఇండియా గురించి కీలక స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

Team India: పంత్, స్కైలకు దెబ్బేశాడుగా.. దూసుకొస్తున్న ధోని 1000 వాలా.. టీ20 ప్రపంచకప్‌ బెర్త్ ఖరారు..
Team India T20i Wc
Follow us
Venkata Chari

|

Updated on: Apr 08, 2024 | 3:54 PM

Virender Sehwag on Shivam dube – Rishabh Pant – Suryakumar Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) సందర్భంగా, టీ20 ప్రపంచ కప్ 2024 కోసం టీమ్ ఇండియాలో చోటు సంపాదించడానికి చాలా మంది భారతీయ ఆటగాళ్ళు తమ సత్తా చూపిస్తున్నారు. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కొంతమంది ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి ప్రపంచ కప్‌నకు సెలెక్ట్ అవుతారంటూ జోష్యం చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లకు శివమ్ దూబే నుంచి గట్టి పోటీ ఎదురుకావచ్చని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. శివమ్ దూబే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు.

ఐపీఎల్ 2024 ఫైనల్ మే 26న జరుగుతుంది. ఆపై ప్రపంచకప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును కూడా ఎంపిక చేయాల్సి ఉంది. ఈ జాబితాలో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ వంటి దిగ్గజ ఆటగాళ్ల పేర్లు కూడా ప్రాబబుల్స్‌గా ఉన్నాయి. అయితే దీనికి ముందు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మాజీ తుఫాన్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ టీమ్ ఇండియా గురించి కీలక స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

టీ20 ప్రపంచకప్‌కు వెళ్లే భారత జట్టులో స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్‌లో సందడి చేసిన శివమ్ దూబే.. రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్‌లకు పోటీ ఇస్తున్నాడని సెహ్వాగ్ అన్నాడు.

ఇవి కూడా చదవండి

Cricbuzz తో మాట్లాడుతూ, IPLలో శివమ్ దూబే ఆడుతున్న తీరు, T20 ప్రపంచకప్‌నకు టిక్కెట్‌ను నిర్ధారించేలా ఉంది. ఈ రేసులో శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లేదా రిషబ్ పంత్ వంటి చాలా మంది ఆటగాళ్లకు దూబే తీవ్రమైన తలనొప్పిలా మారాడు. టీ20 ప్రపంచకప్‌లో మిగిలిన ఆటగాళ్లు టీమిండియాలో చోటు దక్కించుకోవాలంటే నిలకడగా రాణించాల్సి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం, ఇది ముందుకు సాగడానికి ఏకైక మార్గంలా నిలిచింది.

దూబేకి మద్దతుగా నిలిచిన సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్..

భారత మాజీ స్టార్ బ్యాట్స్‌మెన్ సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్ కూడా శివమ్ దూబేకి మద్దతుగా నిలిచాడు. శివమ్ దూబే మైదానం వెలుపలకు బంతిని ఈజీగా కొట్టడం చూసి ఆనందిస్తున్నానని తెలిపాడు. అతను T20 ప్రపంచ కప్ 2024 కోసం భారత జట్టులో ఉండాలి. దూబే గేమ్ ఛేంజర్‌గా మారగలడు. టీ20 ప్రపంచకప్‌కు మే 1 వరకు సమయం ఉంది. అంతకు ముందే భారత్ జట్టును ప్రకటించాల్సి ఉందని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..Set featured image